విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద వర్గాలకు చెందిన యువతను విద్యలో ప్రోత్సహించడంతో పాటు బాల్యవివాహలను నివారించేందుకు ప్రభుత్వం వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలు ఎంతో దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ అన్నారు.
అక్టోబర్ – డిసెంబర్ మాసంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా ద్వారా జిల్లాలో 147 మంది లబ్దిదారులకు ఒక కోటి 32 లక్షల 55 వేల లబ్దిని, లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు.
ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్దిదారులతో కలిసి వీక్షించిన అనంతరం లబ్దిదారులకు ఆర్థిక సహాయపు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మట్లాడుతూ పేద వర్గానికి చెందిన తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆర్థిక పరిస్థితుల కారణంగా వివాహాలు జరిపించలేక, మానసికంగా సతమతమవుతున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్సార్ కళాణ్యమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక చేయుతను అందిస్తున్నామన్నారు. అనేక మంది పేద వర్గాల చెందినవారు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక, చదువులు మాన్పించి పనులలో చేర్పించడంతో పాటు బాల్యంలోనే వివాహాలు జరిపిస్తున్నారన్నారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి చదువేనని నమ్మిన ముఖ్యమంత్రి విద్యా రంగానికి పెద్ద పీఠ వేస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. జగనన్న అమ్మఒడి, ప్రాధామిక స్థాయి నుంచే ఇంగ్లీషుమీడియం విద్య అందించడం, 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక పథకాలను విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. మనబడి నాడు`నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్పుచేసి ఆదునాతన మౌలిక వసతులను కల్పించి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ది చేకూర్చారు. పేదింటి ఆడబిడ్డలకు చదువులో ప్రోత్సహించడం, బాల్యవివాహాలను ఆరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాప్ ఆవుట్ రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వివాహం చేసుకొనే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. ఎటువంటి వివక్షతలకు తావు లేకుండా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి పథకల సహాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్దిదారులకు అందిస్తుందన్నారు. వివాహమైన వారు 30 రోజుల్లోగా పథకానికి దరఖాస్తు చేసుకుంటే అర్హతను గుర్తించి పథకాన్ని మంజూరు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తెలిపారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు నిరుపేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. లంచాలకు వివక్షకు తావు లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను గుర్తిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఆర్థిక సహయాన్ని అందించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని మల్లాదివిష్ణు వర్థన్ అన్నారు.
కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి. శ్రీకాంత్, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ డిడి బి.వి.విజయభారతి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …