Breaking News

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టు, ఆర్‌అండ్‌బి రహదార్ల నిర్మాణ అభివృద్ధి పనులపై స్థానిక పింగళివెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ, నేషనల్‌ హైవే అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్తాబాద్‌ నుండి రాయనపాడు స్టేషన్‌ మధ్య విజయవాడ రూరల్‌ గొల్లపూడి` జక్కంపూడి రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మూడవ లైన్‌ ఓవర్‌ రైల్‌ ప్లైఓవర్‌ నిర్మాణానికి అవసరమైన సబ్‌ డివిజన్‌ రికార్డును సిద్దం చేయాలని ఆదేశించారు. ఇబ్రహీంటప్నం ` పవిత్ర సంగం ఆర్‌అండ్‌బి రహదారికి సంబంధించి అభ్యర్థన పత్రాన్ని త్వరితగతిన సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుణదల రైల్వే డబ్లింగ్‌ లైన్‌ విస్తరణకు సంబంధించి భూ సేకరణకు భూముల విలువలను నిర్థారించి నివేధికను సమర్పించాలని స్థానిక తహాశీల్థార్‌ను ఆదేశించారు. విజయవాడ ` ఖమ్మం గ్రీన్‌ ఫ్రీల్డ్‌ జాతీయ రహదారిలో స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 65 జాతీయ రహదారిలో కంచికచర్ల మండలం పరిటాల వద్ద రెండు లైన్ల బైపాస్‌ రోడ్డును ఆరు లైన్ల విస్తరణలో భాగంగా అవసరమైన మార్కెట్‌ వాల్యూ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, నందిగామ ఆర్‌డివో ఆర్‌. రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డివో వై వి.ప్రసన్నలక్ష్మి, ఏడి సర్వే కె.సూర్యారావు, సంబంధిత మండల తహాశీల్థార్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *