-షాబుఖారి బాబా నిత్య అన్నదాన లంగర్ ఖానా నిర్వాణ పై ప్రశంసలు
-ఘనంగా సత్కరించిన అల్తాఫ్ బాబా
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా సందర్శించారు. సూఫీ మాత గురువులు మరియు ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆయన సాదరంగా ఆహ్వానించి దర్గాలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ఖాదర్ బాషా భవిష్యత్తులో ముస్లింల ప్రతినిధిగా రాజ్యసభలో అడుగుపెట్టాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబా వారికి చాదర్ మరియు పూలు సమర్పించారు. అనంతరం షాబుఖారి లంగర్ ఖానా పరిశీలించి ప్రతిరోజు ఎంతో మంది కడుపు నింపుతున్న నిత్యా అన్నదాన లంగర్ ఖానా ప్తె ప్రశంసలు కురిపించారు. నిత్య అన్నదాత అల్తాఫ్ బాబాను మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం అల్తాఫ్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్ ను ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖాజీ హబీబుల్లా హుస్సేని, భవానిపురం గాల్సిద్ బాబా దర్గా కమిటీ అధ్యక్షులు ముస్తాక్, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు యూనిస్ తదితరులు పాల్గొన్నారు.