Breaking News

బ్యాలెట్ పేపర్ లో అంకెలు మాత్రమే ప్రాధాన్యతగా పెన్ తో వ్రాయాలి.

-దొంగ ఓట్ల వేయడానికి ప్రయత్నిస్తే చర్యలు వుంటాయి.
-ఓటరు స్లిప్ తో పాటు తప్పనిసరి ఐడి వుండాలి.
-ఏజెంట్లు పోలింగ్ రోజు ఉదయం 7 గంటల కల్లా పాస్ పొందాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు పోలింగ్ ప్రక్రియ మరోసారి ఇవ్వడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు రాజకీయ పార్టీల తో జిల్లా కలెక్టర్ సమావేశమై పోలింగ్ ప్రక్రియ వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ , బ్యాలెట్ బాక్సులు సిద్ధంచేసి ఈ నెల 12 న జిల్లాలో నాలుగు డివిజన్ కేంద్రాలలో డిస్ట్రిభ్యూషణ్ కేంద్రాలు తిరుపతి -శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాళహస్తి – స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల సూళ్లూరుపేట – ప్రభుత్వ జూనియర్ కళాశాల, గూడూరు – జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని, 13 న పోలింగ్ అనంతరం పై కేంద్రాల వద్ద రిసిప్షన్ సెంటర్ ఏర్పాటుచేసి బ్యాలెట్ బాక్సు లను బద్రపరచి, ఆపై చిత్తూరు స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు జరుగురుతుందని, ఈ సమయంలో తప్పనిసరి ఏజెంట్లను సూచించాలని అన్నారు. ఒకే ఇంటి నెంబర్ తో పలు ఓటర్లు వున్నాయని జాబితాలో రావడం జరిగింది, పూర్తి స్థాయిలో పరిశీలన చేసాం, అందులో వున్న వారు నమోదు చేసుకున్న అడ్రసు సాఫ్ట్ వేర్ వల్ల పొరపాటు జరిగింది, కానీ ఓటర్లు అందరు ఇతర అడ్రసులో వున్నారు, వారికి దరఖాస్తు ప్రకారం అందులో వున్న అడ్రసు మేరకు పరిశీలించి ఓటరు స్లిప్స్ పంపిణీ చేసాము అన్నారు. ఏజెంట్లు పోలింగ్ రోజు ఉదయం 7 గంటల కల్లా పి.ఓ. వద్ద ఆతరైజేషణ్ లెటర్ ఇచ్చి పాస్ పొందాల్సి వుంటుందని అన్నారు. ఇక ఓటరు కాని వారు ఎవరైనా ఓటు వేయడానికి వస్తే అతనిపై కేసు నమోదు చేయనున్నాం ప్రశాంత వాతరణంలో జరగడాని అందరు సహకరించాలని అన్నారు. తిరుపతిలో అందిన పిర్యాదుల మేరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలగా 13 చోట్ల పటిష్ట బందోబస్తు, పి.ఓ.ల వద్ద ఎ.ఎస్.డి.ఓటర్ల లిస్టు అందుబాటులో వుంచి దొంగ ఓట్ల నియంత్రణ , కేసుల నమోదుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఎ.ఎస్.డి. లిస్టు లో వున్న వారు ఓటు హక్కు ఉపయోగం లో వేలిముద్ర తో పాటు బ్యాలెట్ కౌంటర్ ఫైల్ లో సంతకం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఓటరు ఓటు హక్కు ఉపయోగించు విధానంలో 1 అంకె లేదా రోమన్ అంకెలు తప్పనిసరి మార్క్ చేయాలని , 1 లేకుండా 2,3,4 ….. ఇలా వేస్తె చెల్లదని, ప్రాధాన్యత ప్రకారం 1 నుండి బ్యాలెట్ లో వున్న ఎంత మందికైన మార్క్ చేయవచ్చని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బి.ఎల్.ఓ.లు టెంట్ వేసుకుని మిగిలిన ఓటర్ స్లిప్ లు, ఓటింగ్ విధానం వివరిస్తారని , ఇతర టెంట్ల కు అనుమతి లేదని అన్నారు. ఇచ్చిన పిర్యాదులను సహృదయంతో పరిష్కరించిన జిల్లా కలెక్టర్ వారికి ధన్యవాదాలని సి.పి.ఐ. మురళి , సి పి ఎం నాగరాజు తెలిపారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేయాలని విన్నవించారు. ఈ సమీక్షలో రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.ఎస్.ఆర్.సి.పి. వెంకటేశ్ , సి.పి.ఐ. మురళి , సి పి ఎం నాగరాజు, టిడిపి చంద్ర శేఖర్ , బిజెపి వెంకటేశ్వర్లు ఇతర రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *