Breaking News

బడిబయట పిల్లలు, డ్రాప్ ఔట్ పిల్లలను పాఠశాలలో నమోదుకు చర్యలు చేపట్టాలి

-విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు 1 వ తరగతి సీట్ల ఖాళీల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఈ నెల 16 లోపు తప్పక నమోదు చేయాలి.
-ఎన్ సి డి సర్వే వివరాలు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ సి డి (అసంక్రమిత వ్యాధులు) సర్వేలో గుర్తించిన వ్యాధుల వివరాలను ఆధార్ అనుసంధానం తో ఖచ్చితత్వం గల సమాచారం అందుబాటులో ఉంటుందని, ఆ దిశలో అధికారులు చర్యలు తీసుకోవాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, స్పందన గ్రీవెన్స్ అంశాలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి అన్నారు.

శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో అమరావతి నుండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విద్యా, వైద్య ఆరోగ్య , మహిళా శిశు సంక్షేమ శాఖల కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ అమలుకు ఎంతగానో ఉపకరిస్తుంది అని అన్నారు. ఎన్ సి డి సర్వే లో భాగంగా ఆధార్ అనుసంధానం చేసి డేటాబేస్ ఏర్పాటు, ఎబి కార్డ్ మరియు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సందర్శన, బిపి, డయాబెటిస్ గుర్తించిన వారికి ఫాలో అప్ మందులు, వైద్య సేవలు అందించేలా ఉండాలని అన్నారు. H3N2 వైరస్ లాంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజల్లో రోగ నిరోధిక శక్తి పెంపొందేలా ఫ్యామిలీ డాక్టర్ పరీక్షలు నిర్వహణ మరియు చికిత్సలు చేపట్టాలని అన్నారు. గర్భిణీలకు, వారి ప్రసవానంతరం అందించే సేవలు, అనీమియా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హై రిస్క్ గర్భవతులకు వారం రోజుల ముందుగానే ప్రసవ సమయం అంచనా వేసి ఆసుపత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా తరలించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోషన్- ప్లస్ అందించడం ద్వారా మధ్యస్థ మరియు తీవ్ర అనీమియా నుండి గర్భిణీలు, 19 సంవత్సరాల లోపు పిల్లలు బయట పడవచ్చని అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన -2023 మొదటి విడత కార్యక్రమాన్ని ఈ నెల 14న చేపట్టి విజయవంతం చేయాలనీ అన్నారు. సికిల్ సెల్ అనీమియా నివారణలో వైద్య శాఖ మార్గదర్శకాలు అమలు చేయాలనీ, ఎండలు, వడగాలులు అంచనాలు ఉన్నందున పీహెచ్ సి స్థాయిలో అందుబాటులో ఓఆర్ఎస్ స్యాచేట్ లు అందుబాటులో ఉంచుకోవాలని, పాఠశాలల్లో తగినంత త్రాగు నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రజలు మధ్యాహ్నం 12 గం. నుండి 3 గం. వరకు అవసరం ఉంటే మాత్రమే బయట తిరగాలని సూచించారు. H3N2 ఇన్ఫ్లుఎంజా కు వైరస్ కు మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. రేపటి నుండి వారం రోజులు ఫీవర్ సర్వే గ్రామ వార్డు సచివాలయం స్థాయిలో వైద్య శాఖ ఆదేశాల మేరకు చేపట్టాలని అన్నారు.

బడి బయట పిల్లలను, డ్రాప్ ఔట్ పిల్లలను గ్రామ వార్డు స్థాయిలో గుర్తించి వారిని నాన్ రెసిడెన్షియల్ క్యాంప్, సీజనల్ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి వారిని వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

పాఠశాలల సందర్శనను గ్రామ /వార్డు సచివాలయం మహిళా సంక్షేమ అధికారి, ఎడ్యుకేషన్ సంక్షేమ సహాయకులు తప్పని సరిగా లక్ష్యాల మేరకు తరచూ సందర్శించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కన్సిస్టెంట్ రిథమ్ యాప్ లో నమోదు మరియు పరిష్కారం నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆ వివరాలు యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు . ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యాధికారులు పాఠశాలలు తనిఖీలు చేపట్టాలని, జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యా శాఖాధికారి శేఖర్ ను ఆదేశించారు. నాడు- నేడు పనులలో పురోగతి వేగవంతం చేయాలని అన్నారు.

ఉచిత నిర్బంధ విద్య, విద్యా హక్కు చట్టం -2009 సెక్షన్ 12(1)(C) ప్రకారం 25% సీట్లు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు విద్యా సంవత్సరం 2023- 24 లో 1 వ తరగతి అడ్మిషన్ కొరకు సంబంధిత అధికారులు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పేద వారికి అందించే కుల ధృవీకరణ పత్రాలు, అనాథలకు, HIV బాధితులకు వికలాంగులకు ధృవీకరణ పత్రాలు వెంటనే ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఈ పథకంపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్బంగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలోని 1 వ తరగతి వివరాలను, సిలబస్, ఖాళీలను ఆన్లైన్ పోర్టల్ లో ఈ నెల 16 లోపు నమోదు చేయాలని అన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం లో విద్యార్థుల అడ్మిషన్ కొరకు తల్లిదండ్రులు ఈ నెల 18 నుండి వచ్చే నెల ఏప్రిల్ 7వ తేదీ లోపు http://cse.ap.gov in వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ ప్రభావతి, డి ఎల్ డి ఓ సుశీల దేవి, ఐసి డి ఎస్ పిడి జయలక్ష్మి , ఎస్ సి వెల్ఫేర్ ఆఫీసర్ చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *