-తిరుపతిలో అన్ని పోలింగ్ కేంద్రాలో పటిష్ట భద్రత ఏర్పాటు.
-పిర్యాదులు అందిన వారి పేర్లను ఎ.ఎస్.డి. లిస్టు పి.ఓ. వద్ద అందుబాటులో వుంచి పరిశీలన.
-ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు, సహకరించాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు మూడు రోజులుగా ఒకే ఇంటి నెంబర్ తో ఎక్కువ ఓట్లు వున్నాయని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టారని సి.ఇ.ఓ. నుండి రాజకీయ పార్టీల నుండి పిర్యాదులు అందాయి, పరిశీలిస్తే కంప్యూటర్ ఎంట్రీ సమయంలో జరిగిన పొరపాట్లు, దరఖాస్తులలో వున్న అడ్రస్ లను పరిశీలిస్తే ఆ ఓటర్లు వున్నారని తేలిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం ఎం.ఎల్.సి.ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో డేటా ఎంట్రీలో తప్పుల రావడానికి కారణమైన వారిపై చర్యలు తప్పవు, 138 పోలింగ్ కేంద్రాలు వుంటే 6 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగింది,ఒకే ఇంటి నెంబర్ పై వున్న ఓట్లను పరిశీలిస్తే 110 తేలాయి, దరఖాస్తుల మేరకు ఆ ఓటర్లు వేరే అడ్రస్ లో వున్నారని తెలిసిందని అన్నారు. గెజిటెడ్ అధికారుల అటేస్టడ్ సర్టిఫికెట్లు వున్నావాటిని ఓటర్ జాబితాలో ఉంచామని అన్నారు. ఎదో బారిగా జరిగిందని అంటున్న నేపద్యంలో తిరుపతిలో 14 పోలింగ్ కేంద్రాలు 14 సమస్యాత్మకంగా గుర్తించి వెబ్ క్యాస్టింగ్ , వీడియో గ్రఫీ , ఎ.ఎస్.డి. లిస్టు అందుబాటులో వుంచి , ఓటర్ స్లిప్ తో పాటు , ఐడి ఖచ్చితమైనదా ? కాదా అని నిర్ధారించి పి.ఓ.ఓటింగ్ కు అనుమతి ఇస్తారని అన్నారు. దొంగ ఓట్లు వేయడానికి తావులేకుండా చర్యలు చేపట్టాం, దొంగ ఓటు వేయడానికి వచ్చాడని గుర్తిస్తే వెంటనే కేసు నమోదు , చర్యలు తీవ్రతరంగా ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలి, అందురూ సహకరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి పోలింగ్ కేంద్రానికి మైక్రో అబ్జర్వర్ ల నియమించడం జరిగింది , పోలి౦గ్ కేంద్రంలో జరిగే విషయాలను రికార్డు చేసి జిల్లా ఎన్నికల అధికారికి సంబంధంలేకుండా నేరుగా ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులకు అందిస్తారని అన్నారు. ఎవరికీ బయా౦దోలన వద్దు ఈ నెల 13 న ప్రశా౦తంగా ఎం.ఎల్.సి. పోలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాలోని నాలుగు డివిజన్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ అందుబాటులో ఉంచామని, ఈ నెల 12 న పి.ఓ., ఎ.పి.ఓ.లకు అందించనున్నామని వివరించారు.
తిరుపతి జిల్లా పట్టభద్రుల వివరాలు :
గూడూరు డివిజన్ డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం : జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాటశాల
పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 18,761
సూళ్ళురుపేట డివిజన్, డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం : ప్రభుత్వ జూనియర్ కళాశాల
పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,238
శ్రీకాళహస్తి డివిజన్, డిస్ట్రిబ్యూషణ్ , రిసిప్షన్ కేంద్రం : స్కిట్ కళాశాల
పోలింగ్ కేంద్రాలు 11, ఓటర్లు 15,043
తిరుపతి డివిజన్, శ్రీపద్మావతి మహిళల డిగ్రీ మరియు పి.జి.కళాశాల
పోలింగ్ కేంద్రాలు 29, ఓటర్లు 37,899 , మొత్తం పట్టభద్రుల ఓటర్లు: 86,941
తిరుపతి జిల్లా ఉపాధ్యాయ వివరాలు :
గూడూరు డివిజన్, పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 1345
సూళ్ళురుపేట డివిజన్, పోలింగ్ కేంద్రాలు 9, ఓటర్లు 893
శ్రీకాళహస్తి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 8, ఓటర్లు 811
తిరుపతి డివిజన్, పోలింగ్ కేంద్రాలు 12, ఓటర్లు 3083, మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు:6132
Prajavartha Online Telugu News