ఈ నెల 15 నుండి ఇంటర్ మీడియట్ పరీక్షలు.

-పరీక్షలకు హాజరు కానున్న జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలు 58750 మంది అభ్యర్థులు : డి ఆర్ ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 15 నుండి ఏప్రిల్ 04 వరకు ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహణకు పగడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్ లో ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణ పై జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించగా కన్వినియర్ మరియు ఆర్ ఐ ఓ వి.రమేష్ , జిల్లా అధికారులు హాజరయ్యారు.
జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు ఉంటుందని, పరిక్షా కేంద్రాల వద్ద పోలిస్ బందోబస్తు ఏర్పాటు, ఉదయం 6.00 గంటల నుండి పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం , పరీక్షా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖలు చూడాలని అన్నారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలు 58750 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని , డి.ఇ.ఓ. సహకరించాలని సూచించారు. ఎండల దృష్ట్యా త్రాగునీరు , మెడికల్ డిపార్ట్ మెంట్ మెడికల్ క్యాంపుల ఏర్పాటు, ఓ ఆర్ ఎస్ అందుబాటులో వుంచాల్సివుంటుందని సూచించారు. ఎస్ హెచ్ ఓ లు పోలిస్ స్టేషన్ నందు ప్రశ్నాపత్రాలు బద్రత చూడాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు.
ఈ సమీక్షలో ఆర్ ఐ ఓ రమేష్ , ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి స్వర్ణ లత , డి.ఇ.ఓ. శేఖర్ , వైద్య ఆరోగ్య , విద్యుత్ , పోలిస్ , ఆర్ టి సి శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *