Breaking News

శ్రీ సిటీని సందర్శించిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,  ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి కిషన్ రెడ్డి

-దేశంలో అద్భుతమైన రవాణా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న కేంద్ర మంత్రి
-“శ్రీ నగరం ప్రపంచ స్థాయిలో ఒక విలక్షణమైన ‘పరిశీలనాంశం ‘ అవుతుంది” – కిషన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మంగళవారం శ్రీ సిటీని సందర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లో దేశంలో అద్భుతమైన రవాణా మౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత సంస్కృతి అభివృద్ధి  శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీ సిటీలోని ప్రధాన పారిశ్రామిక యూనిట్ల నిర్వాహణాధికారులతో మంత్రి  నేడిక్కడ సమావేశమయ్యారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల- ప్రోత్సాహక వాతావరణంతో కూడిన అద్భుతమైన ప్రణాళికాబద్ధమైన ఈ పారిశ్రామిక కేంద్రాన్ని మంత్రి  ప్రశంసించారు. ప్రధాన పారిశ్రామిక యూనిట్ల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. వారిని ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ “’వ్యాపారం  సులభతరం చేయడం’ అనే లక్ష్యంతో మంచి విధానాలతో కూడిన నమ్మకమైన సేవలను అందించే ‘న్యూ ఇండియా’కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని మొదటి పది పెట్టుబడి గమ్యస్థానాలలో శ్రీ సిటీ ఒకటిగా నిలుస్తుందని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత ఫలితమని అన్నారు.

కిషన్ రెడ్డి ఉద్యోగావకాశాల కల్పన కోసం శ్రీసిటీ చేస్తున్న కృషిని అభినందిస్తూ , మెట్రో కోచ్‌లు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఎఫ్‌ఎంసిజి, ఆహారశుద్ధి, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్ములేషన్స్ మొదలైన వివిధ రంగాల్లో తయారీ పరిశ్రమలకు నిలయంగా ఉన్న శ్రీసిటీ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. శ్రీ సిటీ ఏర్పాటు వల్ల అక్కడి బంజరు భూమి శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారడమే కాకుండా, ఈ  వెనుకబడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించిందని, ఇక్కడి శ్రామిక శక్తిలో సగానికి పైగా  మహిళలే కావడం చాలా సంతోషకరమైన విషయమని, అనేక ప్రత్యేక లక్షణాల శ్రీ సిటీ ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో వేరే చోట్ల నమూనాగా పరిశీలనాంశం అవుతుందని అన్నారు. ఈ  నమూనా అమలు ఇప్పటికే ఇతర చోట్ల అనుకరించడానికి ఒక రిఫరెన్స్ కేస్‌గా మారిందని గమనించడం చాలా సంతోషకరమైన విషయం అని మంత్రి అన్నారు. “శ్రీ సిటీ ప్రాంతం దాని స్థిరమైన పర్యావరణ అనుకూల,  ఆధ్యాత్మిక పర్యాటక సమూహాలను ఆకర్షించడానికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండడం సంతోష దాయకం అని మంత్రి హర్షం వెలిబుచ్చారు. తన మంత్రిత్వ శాఖ తరపున  అవసరం మేరకు  అభివృద్ధి, ఉపాధి కల్పన పథకాలకు మద్దతు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి రాక సందర్భంగా శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఘనస్వాగతం పలికారు. “శ్రీ సిటీని సందర్శించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *