Breaking News

సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు

-చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
-స్వస్థలాలు చేరేంతవరకూ అండగా నిలవాలన్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్యుద్ధం కారణంగా సుడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే… వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్‌ చేసుకుని అక్కడనుంచి స్వస్థలాలకు చేరుకునే వారకూ కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్‌లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *