Breaking News

ఉత్తమమైన దిగుబడి, పంటలకు మద్దతు లభించే దిశలో సాగు విషయంలో చర్యలు

-ప్రాంతాల వారీగా గత 3 సీజన్లో వొచ్చిన దిగుబడి ఆధారంగా సేకరణ
-కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో  ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో ప్రాంతాల వారీగా గత మూడు ఏళ్ల గా రైతులకు సరఫరా చేసిన గన్ని బ్యాగులకి అనుగుణంగా ఆర్భికే ల పరిధిలో ధాన్యం సేకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.ఖరీఫ్ సీజన్లో అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన నూరు శాతం గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచి సేకరణ చెయ్యడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్  స్పష్టం చేశారు.శుక్రవారం  సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంనకు  ముఖ్య అతిథిగా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ, గత వ్యవసాయ సలహా మండలి సమావేశం లో చర్చించిన పలు అంశాలపై సానుకూలంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఖరీఫ్ సేకరణ కోసం సాగు నుంచి కొనుగోలు చేసే వరకు రైతులు నుంచి వచ్చిన సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ అమలు చేస్తామన్నారు. జిల్లాలో రైతులకు  అవసరమైన ఎరువులు, విత్తనాలు, సాగునీటి విడుదల చెయ్యడంతో పాటు, పండించిన ధాన్యం కొనుగోలుకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో, డిమాండ్ ఉన్న బహిరంగ మార్కెట్ లో వివిధ కంపెనీలు కొనుగోలు చేసే ధాన్యం రకాలు సాగు చేసే దిశలో రైతులకు మేలు చేసే విధానం లో అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు ఆయా కంపెనీలతో సమావేశం నిర్వహించడం ద్వారా రైతులకు మరింత మేలు చేకూర్చి పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఆన్లైన్ లో నవీకరణ చేస్తున్నాం
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, గత ఖరీఫ్ సీజన్లో ఆగస్ట్ నాటికి నూరు శాతం ప్యాడి కోతలు పూర్తి చెయ్యడం జరిగింది. సి ఎం ఆర్ మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణ విషయంలో జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నాము. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 147 మిల్లుల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామన్నారు. వీటిలో 12 మిల్లులకు షో కాజ్ ఇచ్చాము మరో రెండు మిల్లులను మూడు ఏళ్ల పాటు సి ఎం ఆర్ సేకరణ లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయడం జరిగిందన్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం వేదికగా వ్యవసాయ సలహా మండలి వేడుక అని స్పష్టం చేశారు.  మిల్లెట్స్ సాగు, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ రంగం లో సాగు విస్తీర్ణం పెంచేలా అడుగులు వేయాల్సి ఉందన్నారు. రబీలో జిల్లాలో 33 మెట్రిక్ ధాన్యం ఆఫ్ లైన్ లో  3 వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని , ఇందులో 22 మెట్రిక్ టన్నుల వివరాలు మిల్లు లకు అనుసంధానం చేస్తూ, నవీకరణ చేశామన్నారు. మిగిలిన 11 వేల మెట్రిక్ టన్నులను రెండు మూడు రోజుల్లో పూర్తి చెయ్యడం జరుగుతుందని తేజ్ భరత్ అన్నారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు  మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు పనిచేస్తోందని, ఐతే ఖరీఫ్ సీజన్ లో అవసరమైన ధాన్యం బస్తాలు ముందస్తుగా అర్భికెలలో అందుబాటు లో ఉంచాలని తెలిపారు. ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులు కై చర్యలు తీసుకోవాలని కోరారు. భూసార పరీక్షలను నిర్వహించి రైతులకు భూసార ఆరోగ్య కార్డులను అంద చేయాలని కోరారు.జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యక్తిగతంగా స్ప్రేయర్లు, టార్పలిన్స్ , సూక్ష్మ పోషకాలు  యూనిట్స్ రాయితీ పై సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయ యంత్ర పరికరాల మెగా మేళా చేపట్టాలని కోరారు.తొలుత సమావేశంలో భాగంగా రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు, పౌర సరఫరాల, పశు సంవర్ధక, ఉద్యానవన  ఫామాయిల్, కోకో పంటలు సాగు విస్తీర్ణం పెంచే దిశలో చేపడుతున్న పథకాలు పై,  జలవనరుల శాఖ, మైక్రో ఇరిగేషన్ తదితర అనుబంధ శాఖల అధికారులతో రైతులు పలు అంశాలపై చర్చించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా,  జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎమ్. నంద కిషోర్,  ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ,  ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) ఎస్. రామ్ మోహన్, గ్రౌండ్ వాటర్ డి డి వై. శ్రీనివాస్, జెడి (మత్స్య) బ్రహ్మనందం  ఇతర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *