గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పెద్ది రోజా తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రణాలిక విభాగ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణలో నగరపాలక సంస్థ ఆయా విభాగాలతో పాటుగా, ఆర్&బి, విద్యుత్ శాఖలతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. విస్తరణ పనులు ఎక్కువ కాలం సాగితే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని, పనులను వేగవంతం చేయాలన్నారు. ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా జరగాలని, విస్తరణ జరిగిన ప్రాంతంలో వెంటనే డ్రైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు, బకాయిలు చెల్లించని బోర్డ్ లను వెంటనే తొలగించాలని సిటి ప్లానర్ కు స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లకు ప్రణాళిక అధికారులకు రోజువారి లక్ష్యాన్ని కేటాయించాలన్నారు. కోర్ట్ కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు పక్కాగా నమోదు చేయాలని, కంటేమ్ట్ కాకుండా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని, కోర్ట్ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసుల వారిగా ప్రతి వారం సిటి ప్లానర్ సమీక్ష చేయాలని ఆదేశించారు.సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్లు మూర్తి, కోటయ్య, ఏసిపిలు బాబురావు, అజయ్ కుమార్, అశోక్ కుమార్, డిఈఈ రమేష్ బాబు, టిపిఎస్ లు, ఏఈ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News