Breaking News

తిరుపతి పట్టణంలోని ఒబెరాయ్ లక్జరీ హోటల్ కు వర్చువల్ విధానంలో భూమి పూజ శంఖు స్థాపన చేసిన ఆం.ప్ర ముఖ్యమంత్రి

 

-తిరుపతిలో ఒబెరాయ్ లక్జరీ హోటల్ ఏర్పాటుతో మెరుగైన ఉపాధి అవకాశాలు: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా గండికోట నుండి ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రతినిధులు విక్రమ్ ఒబెరాయ్, పర్యాటక శాఖ మంత్రి రోజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తదితరులతో కలిసి వర్చువల్ విధానంలో వైజాగ్ మరియు తిరుపతి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఒబెరాయ్ లక్జరీ హోటల్స్ కు భూమి పూజా కార్యక్రమం నిర్వహించి శంఖుస్థాపన చేయగా తిరుపతి జిల్లా ఏపీ టూరిజం శాఖ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (పేరూరు – అలిపిరి రోడ్డు) దగ్గర సదరు హోటల్ కు కేటాయించబడిన ప్రాంతం నుండి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమ్, జెసి డికే బాలాజీ తో మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒబెరాయ్ గ్రూప్ వారు కడప జిల్లా గండికోట, విశాఖపట్నం, తిరుపతి పట్టణాలలో నెలకొల్పుతున్న సెవెన్ స్టార్ విలాస వంతమైన హోటల్లను సంబంధించి నేటి ఆదివారం ఉదయం భూమి పూజ శంఖు స్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా వర్చువల్ గా కడప నుండి ప్రసంగిస్తూ పర్యాటక రంగంలో నూతన ఉత్తేజం నింపడం కొరకు,పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రైవేట్ రంగం వారిని ప్రోత్సహించడం కొరకు ఔత్సాహిక వేత్తలను ఆకర్షించేలా నూతన పర్యాటక పాలసీ 2020-25 లో భాగంగా లాంగ్ టర్మ్ లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించడమే కాకుండా, నిబంధనల ప్రకారం రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ మరియు నీటి సరఫరా మరియు ఇతర ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థాపకుల పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి మన సిఎం జగన్ మోహన్ రెడ్డి గారే బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరిస్తూ తిరుపతి జిల్లాలో తొలిసారిగా సెవెన్ స్టార్ ఒబెరాయ్ లక్జరీ హోటల్ అందుబాటులోకి వచ్చేల కృషి చేసిన ముఖ్యమంత్రికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా తిరుపతి జిల్లా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి,శ్రీ కాళహస్తీశ్వర స్వామి తదితర ప్రముఖ పుణ్య క్షేత్రాలు కలిగిన టెంపుల్ టౌన్ అని ప్రతి రోజూ లక్ష మందికి పైగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, పలు పర్యాటక ప్రదేశాలు గల తిరుపతి జిల్లాకు రాష్ట్రంలోని, దేశంలోని నలుమూలల నుండి పర్యాటకులే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా పర్యాటకులు వస్తున్నారని, వారికి ఆతిథ్యం అందించడంలో, పలు యాత్రికులను ఆకర్షించడంలో ఒబెరాయ్ లక్జరీ రిసార్ట్స్ హోటల్ ఏర్పాటు తప్పకుండా సఫలీకృతం అవుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా టెంపుల్ టౌన్ గా పుణ్య క్షేత్రాలు సందర్శించే భక్తులు రావడం, టూరిజం హబ్ గా ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు రావడం, హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఎస్వీ మెడికల్ కాలేజీ, బర్డ్స్ హాస్పిటల్ విశిష్ట సేవలు అందిస్తోందని వైద్య సేవల కొరకు పలు ప్రాంతాల నుండి ప్రజలు రావడం, స్వీకార్ క్యాన్సర్ ఆసుపత్రి, పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆసుపత్రి ద్వారా అత్యుత్తమ సేవలతో హెల్త్ హబ్ గా, ముఖ్యమంత్రి గారి చొరవతో పలు పెద్ద పరిశ్రమల ఏర్పాటుతో పరిశ్రమల హబ్ గా అవతరించిందని, ఏడు యూనివర్సిటీలు కలిగి, ఐజర్, ఐఐటి ఏర్పాటుతో విద్యా హబ్ గా ఈ విధంగా పలు రంగాలకు చెందిన ప్రజలను ఆకర్షించి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి దోహదం అవుతోందని ముఖ్యమంత్రికి కలెక్టర్ తెలిపారు.తిరుపతి జిల్లాలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు 20 ఎకరాలను సర్వే నం. 604/9 పేరూరు గ్రామ పరిధిలో, ఏపీ టూరిజం శాఖ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (పేరూరు – అలిపిరి రోడ్డు) సమీపంలో కేటాయించడం జరిగిందనీ, ఈ ఒబెరాయ్ లక్జరీ రిసార్ట్స్ హోటల్ నిర్మాణం లో భాగంగా 100 విలాసవంతమైన స్వతంత్ర విల్లాలు ఏర్పాటు కానున్నాయని, అలాగే మల్టీ కూజన్ వివిధ రకాల వంటకాలు, కాన్ఫరెన్స్ హాల్, బాంకెట్ హాల్, 24 గంటలు కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా, సావనీర్ దుకాణాలు పచ్చని ఆరుబయలు, పార్కింగ్ లాంటి మరెన్నో అత్యాధునిక సదుపాయాలతో తిరుపతి జిల్లా ప్రజలకు, ప్రపంచ నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు, యాత్రీకులకు అందుబాటులోకి రానున్నదని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి వలన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. ప్రభుత్వం నుండి సదరు ఒబెరాయ్ లక్జరీ రిసార్ట్స్ హోటల్ ఏర్పాటుకు అందాల్సిన అన్ని అనుమతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హర్షిత్ పేరూరు సర్పంచ్ కేశవులు, ఎంపీటీసీ చంద్ర మోహన్ జిల్లా పర్యాటకశాఖ ఆర్డి రమణ ప్రసాద్, ఎస్ఈ ఎస్పీడీసీఎల్ కృష్ణా రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, పర్యాటక కార్పొరేషన్ డివియం గిరిధర్, జిల్లా టూరిజం అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి, టూరిజం ఈఈ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *