Breaking News

జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన ఏర్పాట్లు అప్రమత్తంగా చేపట్టాలి:కలెక్టర్

 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ నెల జూలై 12,13 న జిల్లాలో పర్యటించనున్నారని అందుకు తగిన ఏర్పాట్ల కొరకు అధికారులు వారికి కేటాయించిన విధులు సక్రమంగా అప్రమత్తంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి సంబంధిత అధికారులతో అన్నారు.ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెసి డికే బాలాజీ, జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, విజయవాడ రాకేష్ కుమార్ సింఘ్, పిడి జాతీయ రహదారులు నెల్లూరు దేవేశ్ గోయల్, తిరుపతి పిడి వెంకటేశ్వర్లు లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తాత్కాలిక పర్యటన షెడ్యూల్ మేరకు ఈ నెల జూలై12న జిల్లాకు రానున్నరని, 13న ఉదయం తిరుపతి పట్టణంలోని తారక రామ స్టేడియం నందు కృష్ణపట్నం పోర్టు జాతీయ రహదారుల ప్యాకేజీ 2,3 మరియు 4 (పోర్టు కనెక్టివిటీ) కు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరించి శంఖుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొననున్నారని, అనంతరం రేణిగుంట- నాయుడుపేట జాతీయ రహదారి ఎన్హెచ్-71 మార్గంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలోని అన్ని జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి పెద్ద ఎత్తున సామూహిక మొక్కలు నాటే పాన్ ఇండియా కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతం నుండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పగడ్బందీగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు తగినంత బందోబస్తు ఏర్పాటు, రైన్ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్తు, జనరేటర్ ఏర్పాటు, శానిటేషన్ త్రాగునీటి ఏర్పాటు, ప్రోటోకాల్ విధులు, బ్యారికేడింగ్, ఫైర్ సర్వీసు తదితర ఏర్పాట్లను సక్రమంగా అధికారులు నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, ఎస్ డి సి భాస్కర్ నాయుడు, తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ కృష్ణారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి సీతా రామిరెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *