Breaking News

రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డా. రవి శంఖర్ అయ్యన్నార్ వారి ఆదేశాలు మేరకు విజిలెన్స్ అధికారులు మూడు బృందములుగా ఏర్పడి వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజి అధికారులతో కలిసి సంయుక్తముగా కాకినాడ, తూర్పు గోదావరి మరియు డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో సంయుక్తముగా ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనముల దుకాణలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని ఇంచార్జ్ విజిలెన్స్ ఎస్.పి. కె.కుమార్ అన్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలాపురం మండలములోని చిట్యాల గ్రామములోని భవాని ఎంటర్ప్రైజెస్ ఎరువుల దుకాణంను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ఎరువులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ కు గ్రౌండ్ స్టాక్ మధ్య వ్యత్యాసం వుండుట చేత మండల వ్యవసాయ అధికారి, గోపాలాపురం వారు సదరు షాపు యజమాని పై 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సుమారు రూ 53,000/-లు విలువ గల 4.450 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసియున్నారు.ఈ తనిఖిలలో డి. ఎస్. పి పి ముత్యాలనాయుడు, కార్యాలయ ఇన్స్పెక్టర్ రమేష్, తహశీల్దార్ విజయ్ కుమార్ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Check Also

ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో  లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం.

-ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నాం. -ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *