-ఎస్ ఎస్ ఆర్ 2024 లో 18 ప్లస్ ఓటర్ల నమోదు చేయండి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు ఓటర్ల జాబితా సవరణ విషయంలో నియోజక వర్గ ఎన్నికల అధికారులు పూర్తి నిబద్దత తో కూడి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో ఎస్ ఎస్ ఆర్ 2024 పై నియోజక వర్గ, మండల స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందితో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డి ఆర్ వో జి. నరసింహం తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 2024 లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్ ఎస్ ఆర్ 2024 రూపొందించే క్రమంలో ప్రతి ఒక్కరూ హేతబద్ధీకరణ తో కూడి ఓటరు జాబితా రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఆ క్రమంలో మానవ వనరులు, పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్, వలరబుల్ పోలింగ్ కేంద్రాల, మౌలిక సదుపాయాలు పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్లు నమోదు , తొలగింపు విధానం, సర్వీస్ ఓటర్ల నమోదు సంబంధించి జవాబుదారీ తనం కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతి మంగళ వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ వారితో నియోజక వర్గ స్థాయి లో సమావేశం నిర్వహించాలని, బుధవారం జిల్లా స్థాయి లో నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జీ. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, రాజమండ్రి రూరల్ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, రాజానగరం స్పెషల్ కలెక్టర్ ఎస్. సరళా వందనం, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం టిఇఎం రాజు, డిప్యూటీ కలెక్టర్ ఏ. కుమార్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News