Breaking News

ఆహా ఏమి రుచి.. పిడిఎస్ బియ్యంతో పసందైన వంటకాలు

-స్వయంగా దోసెలు వేసిన జిల్లా కలెక్టర్
-ఆకట్టుకున్న కరివేపాకు రైస్, ములగాకు ఉప్మా, తాటి గారెలు ..
-ఒకటికి మించి మరొకటి గా ప్రదర్శించిన 45 వంటకాలు
-ప్రతి ఒక్క స్టాల్ కి వెళ్లి పదార్థాల వివరాలు తెలుసుకున్న ముఖ్య అతిథులు

రాజానగరం,నేటి పత్రిక ప్రజావార్త :
పిడిఎస్ బియ్యం తో పలు రకాల వంటలు నిర్వహించిన వారిలో విజేతలగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ , తృతీయ విజేతలకు నగదు బహుమతులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ చేతుల మీదుగా అందజేశారు.ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వంటల పోటీల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ధ్రువపత్రలు, శాసన సభ్యులు ప్రకటించిన రూ.1000 నగదు బహుమతి ప్రధానం చేశారు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించిన ప్రథమ బహుమతి.. కరివేపాకు రైస్ చేసిన నందరాడ గ్రామం కు చెందిన… జే వేణు, వెంకటరత్నంలకు రు. 10000/- లు అందజేశారు.ద్వితీయ బహుమతి.. తాటి గారెలుజి ఎర్రం పాలెం కు చెందిన కే.లక్ష్మి దుర్గకు రు. 5000/- లు అందజేశారు.తృతీయ స్థానంలో నిలిచిన ఇద్దరికీ 2500 చొప్పున బహుమతిగా…రవ్వ పులిహోర.. పాల ముంజెలు.. కలవచర్ల గ్రామానికి చెందిన తవ్వ లక్ష్మి,ముద్దాడ లక్ష్మి, వై సుజాత ఎన్ వెంకట్ లక్ష్మి లకు రు. 2500/- లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి,  ఇంఛార్జి డి ఎస్ వో విజయ భాస్కర్, డి ఎం మార్కెటింగ్ ఏ. కుమార్, మండల కన్వీనర్ దూలం పెద్ద, జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న,మందారపు వీర్రాజు సీతారత్నం, సర్పంచుల సంఘం అధ్యక్షులు కోలపాటి వెంకన్న,వేమగిరి కృష్ణ, గంగిశెట్టి సోమేశ్వరరావు,రాజానగరం సర్పంచ్ కుందేటి ప్రసాద్, కొల్లి వీర్రాజు,ప్రగడ చక్రి,అడబాల దుర్గారావు, వెలుగు బంధ కాము, తహశీల్దార్ పవన్ కుమార్, పిడి డిఆర్డిఎ ఎస్. సుభాషిణి, డి ఎల్ డివో పి. వీణా దేవి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో  లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం.

-ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నాం. -ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *