-సబ్సిడీపై బియ్యం అమ్మకాలు
-సూపర్ ఫైన్, ఫైన్, సాధారణ బియ్యం అమ్మకాలు
-కుటుంబానికి రూ.5 కేజిలు చొప్పున అమ్మకాలు
– కమిషనర్ అరుణ్ కుమార్
రాజమహేంద్రవరం ,నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్ లో బియ్యం ధరలు పెరిగి నందున రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రైతు బజార్ల లో సూపర్ ఫైన్ రకం కిలో రూ. 46/- లకు, ఫైన్ రకం కిలో రూ. 40/- లకు మరియు సాధారణ రకం కిలో రూ.34/- చొప్పున విక్రయించాలని నిర్దేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ తెలియ చేశారు.ఆదివారం ఉదయం స్థానిక క్వారీ మార్కెట్ సమీపంలో వున్న రైతు బజార్లో బియ్యం అమ్మకం కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ లతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ హెచ్. అరుణకుమార్, మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు బజారులో బియ్యం విక్రయించడానికి నిర్దేశించిన ప్రత్యేక స్టాల్ ను ప్రారంభించామన్నారు. నగరంలో ఈ విధమైన ప్రత్యేక స్టాల్స్ విఎల్ పురం, గణేష్ చౌక్, వై జంక్షన్, శంభూ నగర్ రైతు బజార్లలో ఏర్పాటు చేయడమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు ద్వారా 5 కేజీలు విక్రయిస్తారని పేర్కొన్నారు . ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వినియోగించు కోవాలని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నగరంలో రైతు బజార్లతో పాటు ఎంపిక చేసిన 6 రిటైల్ షాప్స్ ద్వారా పై మూడు రకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. రామకృష్ణ రైస్ స్టోర్స్, సీతంపేట ; లంక అప్పారావు రైస్ స్టోర్స్, తుమ్మలావ ; వరలక్ష్మి రైస్ స్టోర్స్, జాంపేట ; రవితేజ రైస్ స్టోర్స్, ఆల్కట్ తోట ; మొల్లి ధనరాజు రైస్ స్టోర్స్, స్టేడియం రోడ్డు మరియు గ్రంధి చెంచయ్య రైస్ స్టోర్స్, క్వారీమార్కెట్ లందు కూడ ప్రజలకు సబ్సిడీ పై అమ్మకాలు జరపడానికి వీలుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.ప్రజలు రైతుబజారులే కాకుండారిటైల్ షాప్స్ నందుకూడా కొనుగోలు చేసుకోవచ్చు అని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. రాజమహేంద్రవరం పట్టణంలో 5 రైతు బజార్లలో, 6 రిటైల్ షాప్స్ లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడమైన దన్నారు . ఈ స్టాల్స్ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 100 క్వింటాల్స్ మేర బియ్యం విక్రయాలు జరిగినవని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా పౌర సరఫరాల అధికారి విజయ భాస్కర్, డి ఎం మార్కెటింగ్ ఏ..కుమార్ , మార్కెటింగ్ ఏ డీ ఎమ్.సునీల్ వినయ్, మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు, వినియోగ దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News