Breaking News

జగనన్న కు చెబుదాం లో 138 అర్జీలు  కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మండల స్థాయిలో జేకేసి నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి లో ప్రజా సమస్యలని తెలుసుకుని , వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రాజమహేంద్రవరం రూరల్ “జగనన్నకు చెబుదాం” నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎపి గ్రీనింగ్ & సుందరికరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, జేసీ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, డి ఆర్వో జి. నరసింహం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాల మేరకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపాలన్నారు. ఆమేరకు ప్రతి ఒక్క అర్హత కలిగిన అర్జీలను వారం రోజుల లోగా పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు. జిల్లా అధికారులు ఆమేరకు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. జేకేసి లో స్వీకరించిన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చెయ్యడం తో పాటు వాటి తదుపరి పరిష్కార చర్యల ప్రగతిని పర్యవేక్షణ చేసేందుకు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశించిన సమయంలో పరిష్కారం కానీ వాటి విషయంలో సంబంధిత జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారి సిబ్బంది వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం నేపథ్యంలో నిర్వహిస్తున్న జేకేసి ద్వారా రాజమండ్రి రూరల్ నియోజక వర్గ సమస్యల ను పరిష్కరించాలని కోరారు. అటు పట్టణ గ్రామీణ ప్రాంతాల కలయిక వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోందని, వాటికి పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ కింద చేపడుతున్న పనులకు చెంది నిధులను ఖర్చు చెయ్యక పోవడం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని కోరారు. గ్రామీణ నియోజక వర్గ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎపి గ్రీనింగ్ & సుందరికరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు సమాంతరంగా చేపట్టడం జరుగుతోందని అన్నారు. 1902 , జేకేసి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెయ్యడం జరుగుతోందని అన్నారు. మరింత జవాబుదారీతనం ఉండటం కోసం మండల స్థాయి జేకేసి చేపట్టడం జరిగిందన్నారు. వొచ్చిన కొన్ని అర్జీలు ధవలేశ్వరం చెందిన బొక్క అర్జునరావు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారని 20 సంవత్సరాల ధవలేశ్వరం నివాసం ఉంటునట్లు తెలిపారు. ఇంటి స్థలం కోసం అర్జి చేసుకున్నారు. రూరల్ తహశీల్దార్ అర్హత పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ధవలేశ్వరం కి చెందిన పంపాలా శ్రీనివాసరావు రోడ్లు డ్రైనేజీ సమస్య కోసం అర్జి అందచేశారు. జిల్లా పంచాయతీ అధికారి ని తగిన చర్యలు తీసుకోవాలని, నివేదిక అందజేయ్యాలని కోరారు. ధవలేశ్వరం సచివాలయం ఒకటికి చెందిన పడమట నాగజ్యోతి వితంతు పెన్షన్ కోసం అర్జి ఇచ్చారు. తన తల్లి తో నేను నా కుమారుడు  ఒకే డోర్ నంబర్ లో ఒకే రేషన్ కార్డు కలిగి ఉన్నాను. కావున మా పేర్లు విడిగా మార్పు చేసి రేషన్ కార్డు జారీ చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని కోరారు. ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని ఆమేరకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ జిల్లా అధికారులు పి.జగదంబ, కేవి కృష్ణ రావు, జి. శ్రీనివాస రావు, ఎస్ జి టి సత్య గోవింద్, ఏ. ముఖ లింగం, ఎన్ వి సత్యనారాయణ, కె. విజయ కుమారి, జీ. పరశురామ్, ఎస్బివి రెడ్డి, ఏ బి వి రెడ్డి , ఎస్. అబ్రహం, కె యస్ జ్యోతి, డా కే. వేంకటేశ్వర రావు , డా ఏం. సనత్ కుమారి, కె. విజయ కుమారీ, వల్లి, సునీల్ కుమార్, ఎస్. మాధవ రావు, జేవి సత్యనారాయణ, ఇతర జిల్లా మండల, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *