Breaking News

మేరీ మట్టి మేరీ దేశ్ లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యంతో నీరు మట్టి, బియ్యం సేకరించడం జరిగింది

మా భూమి మా దేశం” కలశ యాత్ర రేపు విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు
– కలెక్టర్ మాధవీలత
-పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, స్వంతంత్ర్య స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
-శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో శాసన సభ్యులు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ కలశ యాత్రలో పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి పెంపొందించు కోవాలని అన్నారు. మన దేశ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించటానికి వివిధ ప్రాంతాల నుంచి మట్టిని, నీరును సేకరించే పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు జిల్లాలోని 18 మండలాలు, మూడు పట్టణ ప్రాంతాల నుంచి మట్టి , నీరు, బియ్యం సేకరించి ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. శనివారం విజయవాడ నుంచి ప్రత్యేక రైలు ద్వారా రాష్ట్రం లోని 26 జిల్లాల నుంచి వచ్చే అధికారుల నేతృత్వం లోని బృందాలు విజయవాడ చేరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల నుంచి ఆమేరకు సేకరణ చేపట్టి, ప్రతి మండలం నుంచి 5రెండేసి కలశాలు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకున్నట్లు తెలిపారు. జిల్లా తరపున నోడల్ అధికారిగా డ్వామా ఏ వో జే.సూర్యనారాయణ ను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. తొలుత కలెక్టరేట్ నందు శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, , ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వామా) పి. జగదాంబ తదితరులు కలశ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, , ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వామా) పి. జగదాంబ, డ్వామా ఏ పి డిలు జీ. శ్రీనివాస్, పి ఎస్ అప్పల రాజు, ఏ వో జే.సూర్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు, న్యాక్ విద్యార్ధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *