– అక్టోబర్ 27, 28 సెంట్రల్ జైలు లోని ఖైదీలకు జె ఏ ఎస్ వైద్య శిబిరం
– తొలిరోజు 572 మంది 5ఖైదీలకు వైద్య సేవలు
– అక్టోబర్ 30 ప్రత్యేక మహిళా కారాగారం లో విద్య శిబిరం
– జైల్ సూపరింటెండెంట్ ఎస్ . రాహుల్
– జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లోని ఖైదీల కోసం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత చొరవతో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగిందని జైల్ సూపరింటెండెంట్ ఎస్ . రాహుల్ పేర్కొన్నారు. స్థానిక సెంట్రల్ జైల్ లో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు ఎస్. రాహుల్ మాట్లాడుతూ, తొలిరోజు 572 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఖైదీలకు స్పెషలిస్ట్ డాక్టర్లు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి, తదనుగుణంగా తదుపరి వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక మాట్లాడుతూ, మొత్తం 9 విభాగములకు చెందిన స్పెషలిస్ట్ తొలి రోజు పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. ఆ క్రమంలో కంటి సంబంధ సమస్యల తో పాటు, హుద్రోహ, జనరల్ మెడికల్, అర్థో పెడిక్, తదితర సేవలు అందించినట్లు తెలిపారు. జగనన్న కంటి వెలుగు కింద ఉచితంగా కంటి అద్దాలు అంద జేయనున్నట్లు తెలిపారు. కార్డియాలజీ, అర్థో పెడిక్ , అప్త మలజి, డెంటల్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెంటల్, సైకాలజీ, ఈ ఎన్ టి, సైకాలజీ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఇద్దరు చొప్పున ఈ శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రత్యేక మహిళా కారాగారంలో ఈనెల 30 న మహిళా కారాగారంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్ల తో పాటు గైనిక్ డాక్టర్లు కూడా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News