Breaking News

బ్యారేజ్ రహదారి మరమ్మత్తు పనుల్లో నాణ్యత ఉండాలి

-పనుల అనంతరం క్వాలిటీ చెక్ చెయ్యడం జరుగుతుంది
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విజ్జేశ్వరం వరకు జిల్లా కు చెందిన రహదారి పనుల కోసం కేటాయించిన రూ.25 లక్షల నిధులను నాణ్యత తో కూడి పనులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రతిపాదించిన రహదారుల పనులను ఇరిగేషన్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, బ్యారేజ్ రహదారి ప్రాంతంలో రూ.25 లక్షల నిధులతో చేపడుతున్న పనుల పురోగతిపై క్షేత్ర స్థాయి లో పరిశీలించడం జరిగిందన్నారు. నాణ్యత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం వహించ వద్దని స్పష్టం చేశారు. ఆర్ సి ఆర్ బి (రోడ్ కం రైల్ బ్రిడ్జి) పనులను పూర్తి నాణ్యత కలిగిన ప్రామాణికం గా చేపట్టడం జరుగుతోందని అన్నారు. రహదారి పనుల్లో ప్యాచ్ వర్క్ ఇతర పనులు పూర్తి స్థాయి ప్రమాణాలకు తగినట్లుగా చేపట్టాలని అన్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని, నవంబర్ 9 న ఓపెన్ చేయనున్నట్లు కలెక్టర్ కి వివరించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు ఈ ఈ ఆర్. కాశీ విశ్వేశ్వర రావు, డి ఈ యూ రమేష్, జిల్లా రవాణా అధికారి కేవి కృష్ణా రావు, జిల్లా మైన్స్ అధికారి ఎమ్. సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఏ ఈ ఐ. సాయి బాబా, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *