విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ లో ఉన్న శ్రీరామచంద్ర నగర్ నందు కాలనీ వాసులు నూతనంగా నిర్మించుకొంటున్న శ్రీరామ ధ్యాన మందిరం నిర్మాణానికి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన రోజు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని తమ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక ద్వారా మంగళవారం శ్రీరామచంద్ర కాలనీ ధ్యాన మందిరం సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా భీమిశెట్టి ప్రవల్లిక మాట్లాడుతూ కాలనీవాసుల అవసరాల కోసం కమ్యూనిటీ హల్ కావాలని ఖాళీగా ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని తమకు అప్పగిస్తే అందరం కలిసి కమ్యూనిటీ హల్ నిర్మించుకొంటాం అని కాలనీ పెద్దలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి ఒప్పించడమే కాకుండా మాకు ఆదేశాలు ఇచ్చి కౌన్సిల్ లో పెట్టించి ఆమోదం పొందేలా చేసారని తెలిపారు. అంతేకాకుండా శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాలనీవాసులతో పాటు మా ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందిస్తామని మాట ఇచ్చారని, నేడు ఆ మాట ప్రకారం నగదు ను శ్రీరామ ధ్యాన మందిరం సభ్యులు కి అందజేయడం జరిగింది అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నమ్మకం తో అయితే నన్ను గెలిపించారో ప్రజలు అండగా నిలిచారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ సహకారంతో దాదాపు 15 కోట్ల 30లక్షల రూపాయలతో ఈ 3వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోనే అతిపెద్ద డివిజన్ అయిన ఈ ప్రాంతంలో కాలనీలు, కొండప్రాంతాలు అనే తేడా లేకుండా అన్నివిధాలా అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని తెలిపారు. టీడీపీ హయాంలో కార్పొరేషన్ లో గాని, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఆ పార్టీ వారే ఉన్న సరే డివిజన్ లో ఎందుకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 3వ డివిజన్ లో ఎన్నో ఏళ్ల నుండి జరగని కాలనీ ల రోడ్లు,,పార్క్స్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో దేవినేని అవినాష్ గారి సారధ్యంలో అబివృది చేసాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు,మాజీ డిప్యూటీ మేయర్ ముసునూరు సుబ్బారావు,కాలనీ ప్రెసిడెంట్ సీతారామయ్య,కోటేశ్వరరావు, రమణ, స్వప్న, కొండయ్య, సూరిబాబు, మధు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …