Breaking News

ప్రధాని మోదీ చేతుల మీదుగా నాసిన్‌ శిక్షణా కేంద్రం ప్రారంభం

పాలసముద్రం (శ్రీ సత్యసాయి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్​ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్​తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శించారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగింస్తున్న మోదీ, అనంతరం NACINకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీని ప్రారంభించే కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, డా.భగవత్ కిషన్రావ్ కరాడ్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సందీప్ మల్హోత్ర, సిబిఎస్ఈ చైర్మన్ సందీప్ కుమార్ వర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అహుడా చైర్ పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, నాసిన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ మీడియా సంస్థల కధనాలు, ఫిర్యాదులపై గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *