హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
‘కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ సంతోషంతో చేసుకొనే వేడుకలు సంక్రాంతి. ప్రతి రైతు ఇంటా పాడిపంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.. ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు నిర్వహించారు. గోపూజ చేశారు. పశువులకు మేత అందించారు.
Prajavartha Online Telugu News