Breaking News

జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదిక పై వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్,  ఎస్ టి పి ఐ,  హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ  పంచాయతి రాజ్ , ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య, పల్స్ పొలియో , పప్పు ధాన్యాల సేకరణ , అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత , జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఇతర అధికారులు  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  మార్చి 3వ తేదీన జిల్లాలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలియ చేశారు. 1,90,479 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 1060 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 47 సంచార బృందాలు, 60 సంచార వాహనాలు, 4454 మంది సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలియ చేశారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 48 లక్షల పని దినాలకు గాను 46.71 లక్షలు (97.32 శాతం) సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత భవనాలు కింద 347 అర్భికే లకి గానూ 298 పూర్తి చేశామని, వాటిలో 235 ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ భవనాలు 377 కి గాను 344 పూర్తి చేసి 296 ప్రారంభించామని, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ 258 కి గాను 214 పూర్తి చేసి, 180 ప్రారంభించినట్లు తెలియ చేశారు. మిగిలిన భవనాలు కూడా ప్రజా ప్రతినిధులు ద్వారా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జగనన్న ఆరోగ్య సురక్ష 2 వ విడతలో భాగంగా 168 గ్రామీణ 54 పట్టణ పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించి 92,438 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. సగటున 416 మందికి వైద్య సేవలు అందించడం, సగటున ప్రతి శిబిరంలో 1087 వైద్య పరీక్షలను నిర్వహించినట్లు తెలియ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు,  సిపివో ఎల్. అప్పల కొండ, డ్వామా పిడి ఏ . ముఖ లింగం, వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు,  డా సూర్య ప్రభ, డా ఎన్. సనత్ కుమారి, డా  పి. ప్రియాంక, ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, డిపివో డి. రాంబాబు , ఏస్ ఈ పిఆర్ ఎమ్ డి అలిముల్లా, జిల్లా సర్వే అధికారి ఎమ్.. జోష్యుల , జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ , తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *