Breaking News

“ప్రపంచ జల దినోత్సవం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “ప్రపంచ జల దినోత్సవం” (మార్చ్ 22) సందర్భంగా “జల వనరుల సంరక్షణ”, “జనన, మరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ”, మొదలగు అంశాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కె .ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అందరూ బాధ్యత తో కూడిన నీటి వినియోగ అలవాట్లను అలవారుచుకోవాలని, జల వనరులను కాలుష్యం నుండి పరిరక్షించుకోవాలని అన్నారు. అప్పుడే భావి తరాలకు సురక్షితమైన నీటిని అందించగలమని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 51-ఏ(జి) అధికరణ ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు మెరుగుపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రత్యూష కుమారి తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. వయస్సును నిర్ధారించడంలో, అనేక చట్ట పరమైన అంశాలలో జనన ధృవీకరణ పత్రం అత్యంత కీలకమైనదని వివరించారు. వీటిని జారీ చేసే క్రమంలో సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వీధుల గురించి తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. ఎవరికి ఎలాంటి న్యాయ సలహా కావాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఈ సదస్సులో కాకినాడ జిల్లా డ్వామా అధికారి శ్రీమతి. ఏ. వెంకట లక్ష్మీ, కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.హెచ్.ఎల్.సందీప్ రెడ్డి, ఆర్.ఎం.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ మదార్ షాహ్ అలీ, ఐ.పి.ఓ. సూర్య ప్రకాష్, జల వనరుల , ఇతర అనుబంధ శాఖల అధికారులు, వార్డు సెక్రెటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *