Breaking News

తూర్పు గోదావరి జిల్లాలో ఐదవ రోజు నామినేషన్లు

-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు
-7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 నామినేషన్లు దాఖలు
-జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మంగళవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా మెడిసి రత్నారావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ తరపున ప్రతిపదకుడు, బి ఎస్ పి పార్టి అభ్యర్థిగా పరమట గణేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్ధిగా కుర్రేళ్ళ భాను చందర్ లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

నియోజకవర్గాల వారీగా ఏప్రిల్ 23 వ తేదీ నామినేషన్ల వివరాలు .
040- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తరపున తేతలి అబ్బుస్ రెడ్డీ, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్. ప్రవీణ్ కుమార్ , లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున షేక్ సదర్ హుస్సేన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున వై . శ్రీనివాస రావు లు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

049- రాజానగరం నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ తరుపున జక్కంపూడి సత్తిబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ తరపున ముండ్రు వెంకట శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా కుసుమే గాంధీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరుపున మరియు స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల బలరామ కృష్ణ తమ నామినేషన్లను దాఖలు చేశారు.

050- రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో బి ఎస్ పి పార్టి అభ్యర్థిగా పరమట సురేఖ, అదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ తరపున అదిరెడ్డి వీర రాఘవమ్మ, టీడీపీ తరపున అదిరెడ్డి భవాని, వైఎస్సార్ సీపీ పార్టీ మార్గాన్నిభరత్ రామ్ తరపున మార్గాని సురేష్ లు నామినేషన్ దాఖలు చేశారు.

051- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భల్లెపల్లి మురళీధర్ తమ నామినేషన్ దాఖలు చేశారు.

054- కొవ్వూరు (ఎస్సీ) నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా మొల్ల కమల ఉరఫ్ అరుగోలను కమల, ఉబా శ్రీకాంత్, బొంతా కిషోర్, కొ క్కిరపాటి చిన బాబు తమ నానినేషన్ దాఖలు చేసారు.

055- నిడదవోలు నియోజక వర్గంలో బిఎస్ పి పార్టీ అభ్యర్థులుగా జి. చిత్ర సేను, బయ్యే మునేశ్వర రావు, జనసేన పార్టీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ తరపున ప్రసాంత్ శ్రీనివాస్ తమ నానినేషన్లను దాఖలు చేసారు.

066- గోపాలపురం నియోజక వర్గంలో బి ఎస్ పి అభ్యర్థిగా సిర్రా భరతరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పెనుమాక వినోద కుమారి, మద్దిపాటి వెంకటేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొడ్డిగర్ల నాగార్జున తమ నానినేషన్ దాఖలు చేసారు.

జిల్లాలో ఏప్రిల్ 18 నుండి 23 వరకు నామినేషన్ల దాఖలు వివరాలు :-
08- రాజమండ్రి పార్లమెంట్ కు .. 09 నామినేషన్లు
40- అనపర్తి నియోజక వర్గం .. 08 నామినేషన్లు,
49- రాజనగరం నియోజక వర్గం .. 011 నామినేషన్లు
50- రాజమండ్రి సిటీ నియోజకవర్గం.. 011
51- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం.. 09
54- కొవ్వూరు నియోజకవర్గం.. 15
55- నిడదవోలు నియోజకవర్గం.. 11
66 – గోపాలపురంనియోజకవర్గం.. 08
మొత్తం ఇప్పటి వరకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 9 నామినేషన్లు, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *