Breaking News

గుంటూరు ప్రాంత‌ ప్ర‌జ‌ల‌కు గొప్ప‌సేవ‌లు అందిస్తా..!స్వ‌తంత్ర అభ్య‌ర్ధిని మ‌ల్లెల శివ‌పార్వ‌తి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌ధికంగా అభ్య‌ర్ధులు పోటీచేస్తున్న గుంటూరు పార్లమెంట్ స్ధానానికి స్వ‌తంత్ర అభ్య‌ర్ధినిగా మ‌ల్లెల శివ‌పార్వ‌తి పోటీలో ఉన్నారు. ఈమె ప‌లు తెలుగు చిత్రాలు, టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించి ప్ర‌జ‌లకు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఎమ్మెస్సీ చ‌దివిన శివ‌పార్వ‌తి ప్ర‌ముఖంగా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్‌గా సుప‌రిచితురాలు. చిన్న‌ప్ప‌టినుంచి సామాజిక సేవ‌ప‌ట్ల అభిమానం క‌లిగిన శివ‌పార్వ‌తి త‌న మిత్రులు, ప్ర‌జ‌లు, అభిమానుల అభ్య‌ర్ధ‌న‌మేర‌కు గుంటూరు లోక్‌స‌భ స్ధానానికి గుంటూరు క‌లెక్ట‌రేట్‌లో మార్చి 25న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మ‌హిళ‌లు అత్య‌ధికంగా గ‌ల గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలో వారికోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లను అమ‌లు చేస్తామ‌ని శివ‌పార్వ‌తి తెలిపారు. ప్ర‌జ‌ల అభిమానానికి, వారికి సేవ‌లందించాల‌నే ఆశ‌య‌సాధ‌న‌కోసం తొలిసారిగా తాను ఈ లోక్‌స‌భ స్ధానానికి పోటీ చేస్తున్న‌ట్లు శివ‌పార్వ‌తి తెలిపారు. చిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు, చిన్న‌పాటి వ‌ర్త‌కుల‌కు రుణ‌సౌక‌ర్యాలు, గుంటూరుప్రాంతంలో పొగాకు కార్మికుల‌కు సంక్షేమ ప‌ధ‌కాలు, మిర్చి రైతుల‌కు మ‌రిన్ని మార్కెటింగ్ సౌక‌ర్యాల క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు శివ‌పార్వ‌తి తెలిపారు.ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌ట‌న పూర్తి చేశామ‌ని, ప్ర‌జ‌ల, ఓట‌ర్లు మ‌ద్ద‌తుతో తాను విజ‌యం సాధిస్తాన‌ని శివ‌పార్వ‌తి ధీమా వ్య‌క్తం చేశారు. బ్యాలెట్‌లో త‌న‌ది 27నెంబ‌రు అని, మైక్ గుర్తును కేటాయించార‌ని ఆమె తెలిపారు. స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా పొటీలో ఉన్న త‌న‌కు అంద‌రి మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఈనెల 13న జ‌రిగే ఎన్నిక‌ల‌లో మైక్‌గుర్తుకు ఓటేసి త‌న‌ను గెలిపించాల‌ని శివ‌పార్వ‌తి కోరారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *