-డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి
-మంచినీటి పైపులైన్లు,ఓహెచ్ఎస్ఆర్లు లీకేజిలు లేకుండా చూడండి
-217 వాటర్ సోర్సుల్లో నీటి కంటామినేషన్ ఉన్నట్టు గుర్తింపు తక్షణ చర్యలు చేపట్టాలి
-విలేజ్ సెక్రటేరియట్,ఎఎన్ఎం,అంగన్వాడీ సిబ్బందితో ఇంటింటా ప్రచారం చేయాలి
-పిఆర్అండ్ ఆర్డి,ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్,ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి
-జిల్లా కలక్టర్ల నేతృత్వంలో సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యేరియా నియంత్రణ,వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు రెండు మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్నినిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులు,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియా వ్యాధి నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని పంచాయితీ రాజ్,ఆర్డబ్ల్యుఎస్,వైద్య ఆరోగ్య,మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో గత నాలుగు నెలల కాలంలో గుంటూరు,విజయవాడ, కాకినాడ,జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ప్రబలి అనేక మంది ఆనారోగ్యం పాలై ఆసుపత్రిల్లో చేరారని ఫిబ్రవరిలో ఒక వ్యక్తి డయేరియాతో చనిపోయారని తెలిపారు.అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
రాష్ట్రంలో 217 తాగునీటి సోర్సుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటర్ కంటామినేషన్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఆయా వాటర్ సోర్సుల్లో వెంటనే నీటి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని పంచాయితీరాజ్,ఆర్ డబ్ల్యుఎస్,మున్సిపల్ శాఖల అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్ళే తాగునీటి పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని,ఒహెచ్ఎస్ఆర్ లను కూడా పూర్తిగా తనిఖీ చేసి లీకేజీలను నియంత్రించాలని చెప్పారు.గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని,ఎఎన్ఎం అంగన్ వాడీ,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తి భాగస్వామ్యంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.
ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి.కృష్ణ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నీటి నాణ్యత పరీక్షలను పెద్దఎత్తున నిర్వహించాలని,నూరు శాతం మంచినీటి సోర్సులను తనిఖీ చేయాలని కలక్టర్లకు స్పష్టం చేశారు.మంచినీటి పైపులైన్ల మరమ్మత్తులు,లీకేజీల నియంత్రణకు తీసుకున్నచర్యలపై ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్,పంచాయితీ రాజ్ శాఖల నుండి నివేదికలు స్వీకరించి ఎక్కడా డయేరియా వ్యాధి ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.జూలై 1 నుండి ఆగష్టు 31 వరకూ రెండు నెలల పాటు నిర్వహించే డయేరియా నియంత్రణ ప్రచార కార్యక్రమాన్నిఐదేళ్ళ లోపు చిన్నారులు ఎవరూ డయేరియాతో చనిపోకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈకార్యక్రమాన్నిచేపట్టిందని కృష్ణబాబు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత,చేతులను సుభ్రంగా ఉంచుకోవడం,వ్యర్ధాల సక్రమ నిర్వహణ,సురక్షిత తాగునీరు,ఫంక్షనల్ టాయిలెట్సుపై ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు,జింక్ ట్యాబ్లెట్లు పంపిణీకి చర్యలు తీసుకోవాల్సిఉంటుందన్నారు.అదే విధంగా రోటావైరస్,మీజిల్స్ ఇంజక్సన్లు వేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.హైరిస్క్ ఏరియాల్లో ర్యాఫిడ్ యాక్సన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత శాఖల భాగస్వామ్యం తోపాటు వివిధ స్వచ్ఛంధ సంస్థలను కూడా ఈప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయాల్సి ఉంటుందని చెప్పారు.జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ల నేతృత్వంలో సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పెషల్ సిఎస్ కృష్ణబాబు కలక్టర్లకు సూచించారు.
ఈప్రచార అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఈనెల 22 లోపు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇంటర్ సెక్టోరల్ టాస్కు ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసి ఓఆర్ఎస్,జింక్,ఐవి ప్లూఇడ్స్ సరిపడిన స్టాకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని స్పెషల్ సిఎస్.కృష్ణబాబు తెలిపారు.ఈనెల 24లోపు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్తు అండ్ వెల్నెస్ ఐదేళ్ళ లోపు చిన్నారులను గుర్తించడం చేయాలని ఈనెల 24 నుండి 30 వ తేదీ లోపు విలేజి,వార్డు సచివాలయాలు,విలేజ్ హెల్తు క్లినిక్,పిహెచ్సి,యుహెచ్సి మరియు జిల్లా స్థాయి మైక్రో ప్లాన్ రూపొందించుకుని ఏఆర్ఎస్,జింక్ కార్నర్,కమ్యునికేషన్ స్ట్రాటజీ మానిటరింగ్ మెకానిజాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.అలాగే డయేరియా నియంత్రణపై ఈనెల 24 నుండి 30 వరకు గ్రామ,వార్డు సచివాలయాలు,విలేజ్ హెల్తు క్లినిక్లు,పిహెచ్సి,జిల్లా స్థాయిలో అందరు స్టేక్ హోల్డ్రర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని స్పెషల్ సిఎస్ కృష్ణ బాబు తెలిపారు.
రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వివిధ పట్టణ ప్రాంతాల్లో డయేరియా నియంత్రణకు సంబంధించి మున్సిపల్ కమీషనర్ల బాధ్యులను చేయాలని కలక్టర్లకు స్పష్టం చేశారు.వివిధ తాగునీటి సోర్సులు,పైపులైన్ల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని చెప్పారు.రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్డబ్ల్యుఎస్ విభాగం వద్ద గ్రామ,మండల,జిల్లా స్థాయిల్లో వాటర్ క్వాలిటీ పరీక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయని కావున పెద్దఎత్తున నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి మాట్లాడుతూ అన్నిఅంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులందరికీ సురక్షిత,వేడి నీళ్ళు తాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈసమావేశంలో పిఆర్ అండ్ ఆర్డి కమీషనర్ కె.కన్నబాబు,వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ డా.వెంకటేశ్వర్,సిడిఎంఏ శ్రీధర్,ఇఎన్సిలు కృష్ణారెడ్డి,ఆనందరావు తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News