Breaking News

ఆటోనగర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, బుధవారం, 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధికారులు, సిబ్బంది యోగా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌, నేషనల్‌ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహించాయి.

2024 యోగా దినోత్సవం నేపథ్యాంశమైన “స్వయం మరియు సమాజం కోసం” స్ఫూర్తితో, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను యోగా గురువు శ్రీ శుభ శేఖర్ వివరించారు. సాంప్రదాయ యోగాభ్యాసాలు శారీరక భంగిమలు, శ్వాస విధానం, ధ్యానాన్ని ఏకీకృతం చేస్తాయని ఆయన చెప్పారు. యుగాల పురాతనమై యోగాభ్యాసాన్ని వార్షికోత్సవం రూపంలో జరుపుకోవడం వల్ల, యోగా ప్రాముఖ్యతను, జీవన శైలిని మార్చగల దాని సామర్థ్యాన్ని గుర్తు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగ గురువు డా. జై హింద్ గురూజీ యోగ ఆసనాలను ప్రదర్శించి కేంద్ర కార్యాలయాల సిబ్బంధికి అవగాహన కల్పించారు. 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి, సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించడానికి, విభిన్న సంస్కృతుల మధ్య ఐక్యత పెంచడానికి, ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యలు, మానసిక సవాళ్లను పరిష్కరించడానికి ఒక వేదికగా ఉద్భవించింది.

యోగాసనాల సమయంలో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యోగా గురువులు వివరించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విషయంలో ఆసనాల ప్రాముఖ్యతను గురించి కూడా వివరించారు.

యోగాసనాల కార్యక్రమానికి ముందు, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, ప్రసంగించారు. , ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డా. జి.డి.హల్లికేరి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సీనియర్ అకౌంటెంట్ అధికారిని శ్రీమతి శ్రీదేవి నాయర్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ జాయింట్ డైరెక్టర్ శ్రీ పి.రత్నాకర్, మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి శ్రీ హెన్రీ రాజ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌, నేషనల్‌ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *