Breaking News

సిబిసి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా యోగా దినోత్స‌వం

-బీచ్ రోడ్డులో యోగా పై ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపి శ్రీభరత్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌(సిబిసి) ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చిసిన ఐదు రోజుల చిత్రప్రదర్శనను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో భరత్ మాట్లాడుతూ యోగాను ప్ర‌తిఒక్క‌రు క్ర‌మం తప్ప‌కుండా ఆచ‌రించి శారీర‌కంగా మాన‌సికంగా దృఢంగా మారాల‌ని పిలుపునిచ్చారు. యోగా చేయడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని, క్రమశిక్షణను అలవర్చుకోవచ్చని తెలిపారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సిబిసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజీంద్ర్ చౌదరీ మాట్లాడుతూ అంత‌ర్జాతీయంగా యోగా దినోత్స‌వం నిర్వ‌హించ‌డానికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్‌ఒమోదీ చేసిన కృషి అమోఘ‌మ‌ని తెలిపారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా యోగాపై అవగాహన కల్పిస్తున్నామని నిస్తున్నామ‌ని, యోగా ద్వారా ఆరోగ్యకరమైన స‌మాజ‌ము ఏర్పడి ప్రజలు మరింత మెరుగ్గా పని చేయ‌గ‌లుగుతున్నార‌ని తెలిపారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న ఆంధ్రాయూనివర్సిటీ యోగా విభాగం అధిపతి కె,రమేష్ బాబు మాట్లడుతూ యోగా ద్వారా యోగాను నేర్చుకోవ‌డం ద్వారా శారీర‌కంగా, మాన‌సికంగా ప‌రిప‌క్వ‌త సాధించ‌గ‌ల‌మ‌ని తెలిపారు. కార్యక్రమంలో ఎయూ ఆర్ట్ష్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెషర్ ఎ. నరసింహారావు, సెంట్రల్ కమ్యూనికేష‌న్ బ్యూరో స‌హాయ సంచాల‌కుడు ష‌ఫి మ‌హామ్మ‌ద్, సిబిసి గుంటూరు ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి రమేష్ చంద్ర, యోగా శిక్షకురాలు డాక్టర్ టివిఆర్ చంద్ర, విశాఖపభుత్వ మహిళా కళాశాల, క్రిష్ణ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, యోగాభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేశారు.

యోగా ప్రదర్శనకు ఆద‌ర‌ణ‌
అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా సెంట్ర‌ల్ క‌మ్యూనికేష‌న్ బ్యూరో బీచ్ రోడ్డులోని యోగా విలేజీ వద్ద నిర్వహిస్తున్న ఐదు రోజుల ఉచిత చిత్ర ప్రదర్శనకు విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ చిత్రపద్రర్శనలో భాగంగా ప్రధాని నరేంద్రమోది శ్రీనగర్ లో నిర్వహించిన యోగాను ఎల్సిడి ద్వారా ప్రదర్శించడం జరిగింది. యోగా శిక్షకులు స్థానిక విద్యార్థులకు యోగాలో అవగాహన కల్పించడంతో పాటు యోగాలో మెలకువలు నేర్పిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *