Breaking News

ఎస్.ఎస్.సి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 24వ తేదీ నుండి జరిగే ఎస్.ఎస్.సి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా పదవ తరగతి(ఎస్.ఎస్.సి.) అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే జూన్ నెల 3 వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలలో 395 పాఠశాలలకు చెందిన 6,046 విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వీరి కోసం 24 పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణకు 24 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 24 మంది శాఖా పరమైన అధికారులను, 302 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు.అలాగే 2 ఫ్లయింగ్ ప్యాడులను, 11 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలు, రహస్య సామాగ్రిని భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల వద్ద, వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించేటపుడు, పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో ఫ్లయింగ్ స్క్వాడులు ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు ఎవరు గుమికూడకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను గట్టిగా అమలు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు సజావుగా పర్యవేక్షించేందుకు ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడ జిరాక్స్ కేంద్రాలు మూసివేసేలా గట్టిగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను వచ్చిన రోజే సకాలంలో ఉన్నతాధికారులకు బట్వాడా చేయడానికి తపాలా శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాలకు చుట్టుపక్కల విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కావాల్సినన్ని మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రశ్నాపత్రాల పంపిణీలోను, జవాబు పత్రాలు తపాలా కార్యాలయానికి చేరవేయడంలో కావలసినన్ని వాహనాలను రవాణా శాఖ సమకూర్చాలన్నారు. అలాగే రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో వచ్చే జూన్ 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు నిర్వహించనున్న ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు కూడా సజావుగా చేయాలన్నారు

ఈ గూగుల్ మీట్ లో జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, డీఈవో తహేరా సుల్తానా, ఎస్బి ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, డిటిసి పురేందర్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ డేవిడ్ రాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *