Breaking News

మహిళలపై దాడుల సంస్కృతిని ఖండించాలి… : గజ్జల వెంకటలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా తమకు ఓట్లేయలేదనే కక్షతో మహిళలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్ అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై జరిగిన దాడిని మహిళా కమిషన్ దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావడం జరిగిందన్నారు.

ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పందించారు. బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్,ఎస్పీకి లేఖ రాశారు ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం అని అన్నారు.  ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం అని అన్నారు.  పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి మరీ వారిని కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేశారన్నారు.  చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్న పరిస్థితిని చూశాం అని అన్నారు.  అంటే, వారు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటేసిన హక్కు లేదా..? అని అన్నారు.  వారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన అదే పాపంగా వారిని చంపేస్తారా..? అని అన్నారు.  ఏంటి ఈ దౌర్జన్యం ..? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..? అని అన్నారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ.. మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారన్నారు.  ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *