Breaking News

ఉద్యోగం త్వరగా సాధించాలంటే ఐటిఐ బెస్ట్ కోర్స్ – ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. కొంతమంది కుటుంబ కారణాల వల్ల త్వరగా ఉద్యోగం పొందాలని కోరుకుంటారు.ఈ పరిస్థితిలో ఎక్కువ మంది విద్యార్థులకు ఐటీఐ కోర్సు వరంలాంటిది అని ఒకేషనల్ గైడెన్స్ జిల్లా కమిటీ చైర్మన్ దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు.సోమవారం ఉదయం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ ఆవరణలో ఉన్న ఐటిఐ ప్రాంగణంలో ఒకేషనల్ గైడెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఒకేషనల్ గైడెన్స్ కమిటీ చైర్మన్ విక్టర్ బాబు మాట్లాడుతూ ఐటీఐ చదివిన వెంటనే అభ్యర్థి నైపుణ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఐటీఐ తర్వాత రైల్వే, ఆర్మీ సహా అనేక ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో కూడా సులభంగా మంచి ఉద్యోగం పొందవచ్చు అని అన్నారు.

అదే విధంగా ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ కనకరావు మాట్లాడుతూ ఐటిఐ అడ్మిషన్లు ప్రారంభమైయ్యాయి అని జూన్ 10 వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించబడతాయి అని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ త్వరితగతిన అడ్మిన్షన్ల్ ప్రక్రియ పూర్తి చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.విజయలక్ష్మి,జిల్లా పరిశ్రమల అధికారి సాంబయ్య,జిల్లా ఇంటర్మీడియట్ విద్యధికారి ఎస్.ఎన్ రెడ్డి,జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్,ఒకేషనల్ గైడెన్స్ అధికారి వై.సత్య బ్రహ్మం,ప్రాంతీయ ఉపాధి కల్పన అధికారి రామ్మోహన్ రెడ్డి, జన శిక్షణ సంస్థ నుండి పూర్ణిమా,ప్రయివేటు రంగ సంస్థల నుండి వరుణ్ మోటార్స్ తరుపున కిషోర్, ప్రయివేట్ ఐటిఐ మేనేజ్మెంట్ సెక్టర్ నుండి సుచిత్ర ఇతర తదితర ప్రయివేటు యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *