Breaking News

ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 24వ తేదీ నుండి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రకడ్బందీగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో మంగళవారం డి ఆర్ వో వి. శ్రీనివాసరావు ఇంటర్మీడియట్, పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుండి జూన్ నెల 1 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, అదేవిధంగా ఈనెల 24 తేదీ నుండి జూన్ మూడో తేదీ వరకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరం 28,668 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 6,545 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జూనియర్ ఇంటర్ పరీక్షలు, మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5-30 గంటల వరకు సీనియర్ ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,702 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి 35 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 35 మంది చీప్ సూపరిండెంట్లు, మూడు ఫ్లయింగ్ స్కాడ్లు, నలుగురు రూట్ ఆఫీసర్ల ను నియమించామన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.

పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించటంతో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా పరీక్షలు జరిగే సమయంలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా విద్యార్థులకు ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

తపాలా కార్యాలయం ద్వారా జవాబు పత్రాలను స్పీడ్ పోస్ట్ లో పంపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాల విజయవంతంగా నిర్వహించాలని డిఆర్ఓ వి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, డీఈవో యు. వి. సుబ్బారావు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కే వి ఎన్ కుమార్, డీఈసీ సభ్యులు శ్రీరామ్ మూర్తి, వెంకట్రావు, ఆర్యపత్ ఉన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *