Breaking News

ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహము ప్రవేశము కొరకు ప్రకటన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులైన అనగా శారీరక, బధిర, ధృష్టి లోపం కలిగి, 3వ తరగతి నుండి పి.జి. వరకు చదువుచున్న వారికి ఎల్.బి.ఎస్. నగర్, పాయకాపురం, విజయవాడ నందు ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహము నడుపబడుచున్నది. ఒకసారి 3వ తరగతి నందు ప్రవేశము పొందిన వారు, వారి వసతికై వేరు వేరు ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువు కొనసాగించుకోవచ్చు. ఈ వసతి గృహములో విద్యార్ధులకు దుస్తులు, భోజనం మరియు వసతి, నోటు పుస్తకములు, బెడ్డింగ్ మెటీరియల్, సౌందర్య పోషణ ఖర్చులు ఉచితంగా ప్రభుత్వము వారు నిర్దేశించిన మేరకు అందజేయబడును. పై వసతులతో పాటుగా నర్సింగ్ సేవలనుకూడా అందజేయబడును. కావున జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్ధులు (బాలురు) ఈ అవకాశమును ఉపయోగించుకొనవలసినదిగా తెలియపరుస్తూ, అడ్మిషన్ కోరువారు మరియు ఇతర వివరముల కొరకు ఎన్. నాగ స్వర్ణ, వార్డెన్ గ్రేడ్-1, ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహము, ఎల్.బి.ఎస్. నగర్, పాయకాపురం, విజయవాడ వారి ఫోను నెం. 9618972097 నందు సంప్రదించగలరు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *