Breaking News

ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24×7 భద్రత అప్రమత్తంగా ఉండాలి…. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నుండి ఈవిఎం లను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిషాంత్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *