– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని 19 వసతి గృహాలకు ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ. 3,700 విలువైన 19 బయోమెట్రిక్ డివైజ్‌లను కలెక్టర్ డిల్లీరావు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయా సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల (ఏఎస్‌డబ్ల్యూవో)కు అందజేశారు. అదే విధంగా జగ్గయ్యపేట ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహ కాంపౌండ్ వాల్‌కు అవసరమైన ఐరన్ మెస్‌ను కూడా అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉండి విద్యార్థులు బాగా చదువుకునేందుకు వీలుగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతోందని, అవసరమైన మౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు. విద్యార్థుల ఆన్‌లైన్ హాజరు నమోదుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఏఎస్‌డబ్ల్యూ, హెచ్‌డబ్ల్యూవోలు పాల్గొన్నారు.