Breaking News

విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం చేసినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎయిర్ ఇండియా 15.06.2024 తేదీ మొదలు A-320 విమాన ప్రయాణంతో ముంబై-విజయవాడ- రోజువారీ నాన్‌స్టాప్ విమానాలను ప్రారంభించింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ముంబై నుంచి సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ఈ విమానం విజయవాడ నుంచి రాత్రి 7.10 గంటలకు బయలుదేరి రాత్రి 9.00 గంటలకు ముంబై చేరుకుంటుంది. ముంబైకి ఈ రోజువారీ నాన్‌స్టాప్ ఫ్లైట్ ప్రారంభంతో విజయవాడ పొరుగు జిల్లాల విమాన ప్రయాణికుల చిరకాల ఆకాంక్ష, అవసరం నెరవేరింది. ఇది విజయవాడను భారతదేశంలోని పశ్చిమ భాగానికి అనుసంధానించడమే కాకుండా అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాలకు అంతర్జాతీయ మార్గాలను తెరుస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు విజయవాడ-ముంబై సెక్టార్‌లో కొత్త విమాన సర్వీసుకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ విమానాశ్రయం నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు విమాన అనుసంధనతను మెరుగుపరచడానికి తన మద్దతును హామీగా ఇచ్చారు.
మొదటి ప్రయాణ టికెట్టును ప్రయాణికుడికి వల్లభనేని బాలశౌరి కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి . విజయవాడ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, CASO వెంకట రత్నం, ప్రాజెక్ట్ ఇంచార్జి వి. రామాచారి , ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్  పార్థసారథి , ఇతర విభాగాధిపతులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *