– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తిభావం, కరుణ, ఐక్యత, త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు భక్తితో జరుపుకొని అల్లా ఆశీస్సులతో సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారన్నారు. అల్లా ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి పథంలో పయణించేలా ముస్లిం సోదర సోదరీమణులు ప్రార్ధన చేయాలని కలెక్టర్ డిల్లీరావు ఆకాంక్షించారు.