Breaking News

మామిడి కాయల ధర (తోతాపురీ) టన్నుకు 30 వేల రూపాయలకన్నా తక్కువ ధర చెల్లించనచో కఠిన చర్యలు ఉంటాయి…

-తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
-తిరుపతి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, మామిడి ర్యాంపు యజమానులు, మామిడి కాయల మండీ ల యజమానులు మామిడి కాయలు (తోతాపురి) టన్నుకు 30 వేలకు తగ్గుకుండా ధర రైతులకు చెల్లించాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, మామిడి ర్యాంపు యజమానులు, మామిడి కాయల మండీ యజమానులు తోతాపురి మామిడికాయలకు టన్నుకు 30 వేల రూపాయలకు తగ్గుకుండా ధర రైతులకు చెల్లించాలని, అలా కాకుండా తక్కువ ధర చెల్లించనచో కఠిన చర్యలు ఉంటాయనీ తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

తిరుపతి జిల్లాలో మామిడి పంట 52,000 ఎకరాలలో సాగు చేయుచున్నారని, ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిందని, సాధారణంగా ఎకరానికి నాలుగు నుండి ఆరు టన్నులు దిగుబడి వచ్చేదని అయితే ఈ సంవత్సరం ఎకరాకు రెండు టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొన్నదని, దిగుబడులు తగ్గడం వలన ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారని అయితే గత నాలుగు అయిదు రోజులుగా మామిడి ధరలు పతనం కావడం పై జిల్లా కలెక్టర్ గారు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులతో మామిడి ధరలపై సమీక్షించారు.

ఆ మేరకు జిల్లాలో ఉన్నటువంటి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, ర్యాంపు యజమానులు, మామిడి మండీల యజమానులు ఎవరైనను మామిడికాయలకు (తోతాపురి) టన్నుకు 30 వేల రూపాయలకు తగ్గకుండా చెల్లించాలని ఆదేశించారు. అలాకాకుండా ఎవరైనా టన్నుకు 30 వేల రూపాయలకన్నా రైతులకు తక్కువ చెల్లించినచో అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *