Breaking News

ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పట్ల అత్యధిక వాదాన్ని తెచ్చి ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కే చంద్రశేఖర రావు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని జిల్లా కేంద్రానికి వస్తుంటారని వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు

కలెక్టరేట్ మీ కోసం కార్యక్రమంలో మొత్తం 152 అర్జీలను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

-కంకిపాడు కు చెందిన కోలవెన్ను గుణశేఖర్ మాట్లాడుతూ తన తండ్రి సుబ్బారావు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పని చేస్తూ గత సంవత్సరం జనవరి లో అనారోగ్యంతో చనిపోయారని తాను బీటెక్ చదువు చదువుకున్నానని తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు

-బాపులపాడు మండలం మదిచర్ల గ్రామానికి చెందిన భూక్య చంద్రం అనే దివ్యాంగులు మాట్లాడుతూ తనకు ప్రస్తుతం 6000 రూపాయల పింఛను వస్తుందని ప్రభుత్వం పెంచిన పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.

-బంటుమిల్లి మండలం ఆముదాల పల్లె గ్రామానికి జన్ను వీర అర్జున మాట్లాడుతూ రామవరపు మోడీ రెవెన్యూ పరిధిలో ఉన్న తన సాగు భూమిలో సార్వా వరి పంట సాగు చేసుకున్నానని, ఓఎన్ జి సి వారు కెమికల్ వాటర్ కారణంగా తనకు పంట నష్టం జరిగిందని, ఎకరా పంటకు 50 వేలు ఖర్చు చేశానని, పంట కోయకుండానే కుళ్లిపోయిందని నష్టపరిహారం చెల్లించమని గత డిసెంబర్ లో కోరానని, నష్టపరిహారం చెల్లించడంలో ఓఎన్జిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారిపై తగిన చర్యలు తీసుకుని తనకు నష్టపరిహారం చెల్లించేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.

-కృత్తివెన్ను మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన పెదసింగు దావీదు రాజు మాట్లాడుతూ గ్రామ సర్పంచు కొల్లాటి పోతురాజు అర్హత లేకపోయినప్పటికీ మత్స్యకార భరోసా పొందారని, ప్రత్యేక అధికారిచేత విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి జీవీ సూర్యనారాయణ, జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి ఏపీఎంఐపీ అధికారి విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్.ఈ.విజయ కుమారి, సర్వే భూ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *