Breaking News

కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా చర్యలు

-తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కే.వి సత్యవతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ కె. వి.సత్యవతి మంగళవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంజ్ సర్కిల్ దగ్గర నుండి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వరకు జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించారు. బెంజ్ సర్కిల్ నుండి రామవరపాడు వెళ్ళు నేషనల్ హైవే ఇరువైపులా జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించి, మిగిలి ఉన్న ఫెన్సింగ్ పనులను త్వరగా పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, కాలుష్యాన్ని తగ్గించే విధంగా గ్రీనరీ నిర్వహణ కూడా చర్యలు తీసుకోవాలని ఓ &ఎం సూపర్వైజర్ తగిన చర్యలు తీసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేస్తూ పచ్చదనాన్ని అందంగా పర్యావరణాన్ని పెంపొందించే విధంగా ఉండాలని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కాలుష్యం లోని పీఎం లెవెల్స్ 10కి మించకుండా ఉంటాయని ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్య రహితమైన పర్యావరణాన్ని కల్పించాలని అన్నారు.

తదుపరి మూడో డివిజన్లో రోడ్ మార్జిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను గమనించి ఆ డివిజన్లో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సానిటరీ సెక్రటరీలకు తక్షణమే ఆ వ్యర్థాలను తొలగించాలని, డ్రైన్ ల చుట్టూ పెరిగిపోయి ఉన్న కలుపు మొక్కలను వెంటనే తొలగించాలని, డ్రైనేజ్ లో నీరు ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉన్న వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారు ఆదేశాలిచ్చారు.

తదుపరి నాల్గవ డివిజన్ సందర్శించి పరిశీలించారు అక్కడ ఒక హోటల్ కిచెన్ వ్యర్ధాలను సైడ్ డ్రైన్ లో కలపడం గమనించి, ఆ వ్యర్ధాల వల్ల సైడ్ డ్రైన్ లు పూడుకు పోవటమే కాకుండా డ్రైనేజ్ ప్రవాహానికి ఆటంకం కలిగే విధంగా ఉన్నాయని, తక్షణమే ఆ హోటల్ పై ఫైన్ వేటమే కాకుండా అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ 3, సానిటరీ ఇన్స్పెక్టర్ను హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి హోటల్లోని కిచెన్ వ్యర్థాలకు ఒక ఇంటర్నల్ ఛాంబర్ చేసుకొని సైడ్ డ్రైన్ లో కలపకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

అంతేకాకుండా ఇంజనీరింగ్ మరియు ప్రజా ఆరోగ్య సిబ్బందిను నేషనల్ హైవే కింద నుండి వెళ్లే కలవర్ట్ లలో ఉన్న పూడికలను తీసి తరచుగా శుభ్రపరిచి వర్షపు నీరు నేషనల్ హైవే పైన నిలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దానికి తగ్గట్టు సర్వీస్ రోడ్ లో ఉన్న డ్రైనలలో ఎప్పటికప్పుడు పూడికలు తీస్తూ వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్డుపైన నిలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *