విజయవాడ నగరపాలక సంస్థలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశం

-బెంచ్ మార్కులను రీచ్ అయిన విజయవాడ నగర పాలక సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థలో 5వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఉదయం జరిగింది. అయిదవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వివిధ శాఖాధిపతుల సమక్షంలో జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక స్థితిని సమీక్షించి, మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన పలు చర్యలపై చర్చించారు.

టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ, ఆ సైన్డ్ టాక్స్, రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, సానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బేసిక్ నీడ్స్ లాంటి తదితర అంశాలపై వివిధ శాఖాధిపతులతో వివరంగా చర్చించారు. ప్రతి విషయంలో విజయవాడ నగరపాలక సంస్థ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బెంచ్ మార్కులను అందుకున్నందుకు ప్రశంసించడమే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ అయినా ఆర్ ఆర్ ఆర్( రెడ్యూస్ రియూస్ రీసైకిల్) విజ్ఞాన కేంద్రం- సాధారణ డంపింగ్ యార్డ్ను అసాధారణమైన ఎక్స్పీరియన్స్ థియేటర్ గా మార్చి వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి ప్రజలకు విద్యార్థులకు తెలిసేటట్టు అవగాహన కల్పించే విధంగా చేపట్టిన రెడ్యూస్ రీ యూస్ రీసైకిల్ విజ్ఞాన కేంద్రాన్ని,ఐకానిక్ పార్క్, రివర్ ఫ్రంట్ పార్క్, కెనాల్ బ్యూటిఫికేషన్, నగర్ లో జరిగిన బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ని ప్రశంసించారు.

ఈ సమావేశంలో 5వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎస్ రత్నకుమారి, మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి , స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, ప్రొఫెసర్ ఎం వి ఎన్ పద్మారావు, కే కృపారావు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, శివరామకృష్ణ, సూపరిండెంట్ ఇంజనీర్లు నరసింహమూర్తి, రామ్మోహన్రావు, అకౌంట్ ఎగ్జామినర్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *