Breaking News

రానున్న 2027 గోదావరి పుష్కరాలు నాటికి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం

-పర్యాటకపరంగా ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం
-ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది
– పర్యట శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక , ఇకో, మెడికల్ టూరిజం అభివృద్ది లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరీలు పేర్కొన్నారు

మంగళవారం ఉదయం స్థానిక పుష్కర ఘాట్ , కోటిలింగాల రేవు, సరస్వతి ఘాట్ , హ్యవాలాక్ బ్రిడ్జి, రైల్వే వంతెన, గామాన్ బ్రిడ్జి, రోడ్డు కమ్ రైల్ వంతెన గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం మూడు గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ రానున్న 2027 గోదావరి పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటినుండే రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటకపరంగా ఆధ్యాత్మికపరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం వచ్చేలాగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తీర్చి దిద్దడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రానున్న నాలుగైదు నెలలు చర్చించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గోదావరి నది తీర ప్రాంతాన్ని కాల్చేరేషంగా కాలుష్య రహితంగా అభివృద్ధి పరచడం తోపాటు, హేవ లాక్ బ్రిడ్జి పై సుందరీ కరణ పనులను చేపట్టడం ద్వారా ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించి పాదాచారులకు అందుబాటులోకి తీసుకుని వొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాజమహేంద్రవరం పర్యాటకపరంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి దిశగా ఆలోచన చేపట్టడం అందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలను రూపొదిద్దడం జరుగుతుందన్నారు. పర్యాటకపరంగా తూర్పు జిల్లా ప్రధాన రాజమహేంద్రవరం రానున్న రోజుల్లో మరింత గా అభివృద్ధి చేసేలా, పర్యాటకశాఖ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం కోసం స్ధానిక ప్రజా ప్రతినిధుల సలహాలు సూచనలు పరిగణన లోకి తీసుకోనున్నట్లు తెలిపారు.

దక్షిణ కాశీగా పేరొందిన ఈ ప్రాంత అభివృద్ది, గోదావరి నది పరిరక్షణ, రానున్న 2027 గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడం లోను చేపట్టవలసిన ప్రణాళికలపై ప్రజాప్రతినిధులు అధికారులతో తొలి సమావేశం నిర్వహించా మన్నారు. మరిన్ని ఘట్ల నిర్మాణం చేపట్టడం, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పన , తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఘాట్ల నిర్వహణ , మరిన్ని ఘాట్ల నిర్మాణం, భక్తుల మెరుగైన సదుపాయాలు, వసతులు, గోదావరి పుష్కర యాత్రికుల క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ కోసం సమగ్రంగా చర్చించి ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. కేవలం పుష్కరాలును మాత్రమే దృష్టిలో ఉంచుకోకుండా, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దే దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని, ఇందుకోసం ఏజెన్సీ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి, సీనియర్ శాసన సభ్యులు బుచ్చయ్య చౌదరి, యువ ఎమ్మెల్యే వాసు, అధికారులతో కలిసి ఘాట్ల ను సందర్శించి పర్యవేక్షణ చెయ్యడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం పర్యాటక పరంగా మంచి అవకాశం ఉన్నా దృష్ట్యా , పర్యటానికి పెద్ద పీట వేసేలా గోదావరీ పరీవాహక ప్రాంత అభివృద్ది, ఇకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం ను కలుపుకుని సమగ్ర పర్యాటక అభివృద్ది సామర్ధ్య విధానం లో అభివృద్ది చేసే ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమే నని, రానున్న రోజుల్లో దశల వారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆమేరకు అడుగులు వేయనున్నట్లు తెలిపారు. 2027 నాటికి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం , ప్రత్యేక గుర్తింపు తీసుకు రావడం లక్ష్యంగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.

పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ, తానున్న 2027 గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం రాజమహేంద్రవరం మరింత సుందరంగా స్థితిదే వినాయకులపై పర్యటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు. అందులో భాగంగా రోడ్ల అభివృద్ధి, నగరానికి వచ్చే సందర్శకులకు మౌలిక సదుపాయాలు పై చర్చించామన్నారు. రానున్న పుష్కరాలకు భక్తులు తాకిడి ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉన్న దృశ్య అందుకని చర్యలు అంశాలపై కూలంకుషంగా చర్చించామన్నారు. రెవిన్యూ, పోలీస్ , నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బి, పర్యటకశాఖ , ఇరిగేషన్ శాఖ తదితర అన్ని సమావేశాలతో సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాం అన్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఆయా శాఖలతో సమీక్ష నిర్వహించి నివేదిక సిద్ధం చేయడం జరుగుతుంది అన్నారు. ఆ నివేదిక ఆధారంగా పరిరక్షణ మంత్రి సమక్షంలో సమీక్ష నిర్వహించి నిధులు విషయమై తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు.. కేవలం గోదారి పుష్కరాలు నేపథ్యంలో కాకుండా రాజమహేంద్రవరం అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా 50 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలాగా అడుగులు వేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి తెలియజేశారు.

 

రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గత మూడు పుష్కరాల లో గోదావరి నది పరివాహ ప్రాంతాన్ని ఘాట్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రానున్న 2027 గోదావరి పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తూన్నామన్నారు. గోదావరి నది ఈ ప్రాంతం ద్వారా ప్రవహించడం ఆ దేవుడిచ్చిన గొప్ప వరమన్నారు. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం, టెంపుల్ టూరిజం పరంగా అభివృద్ది చెయ్యడం అనే రెండూ ప్రథాన అంశాలను దృష్టిలో పెట్టుకోవడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాల సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని, నగరాన్ని, గోదావరి నది తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వెయ్యడం జరుగుతోందని బుచ్చయ్య చౌదరి తెలిపారు.

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి నదిని సంరక్షణ గాట్ల అభివృద్ధి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేకత దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలు నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆధ్వర్యంలో సమీక్షించుకోవడం జరిగిందన్నారు. రానున్న మూడు నెలల కాలంలో ట్రాఫిక్ పరంగా, హాస్పిటాలిటీ పరంగా ఏ విధంగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలమో … అనే అంశంపై కులం క్యూషంగా చర్చించి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దడం జరుగుతున్నట్లు తెలిపారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు దీర్ఘకాలిక బహుళార్థక ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల పరంగా అందించే సహకారం నగరపాలక సంస్ధ ద్వారా చేపట్టే పనుల పరంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అప్పర్ రివర్ ఫ్రంట్ ప్రాంతంలో అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం జరుగుతోందని, రివర్ లోయర్ ఫ్రంట్ కు సంబంధించిన సమగ్ర కార్యాచరణ సిద్దం చేయనున్నట్లు తెలిపారు. ఆయా పనుల కోసం సుమారు తూ 1050 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని, వాటి కోసం కసరత్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు.

ఈ ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్, ప్రజలను జాయింట్ డైరెక్టర్ టూరిజం అధికారి వి , స్వామి నాయుడు, ఎస్సీ ఆర్ఎంసి జి పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *