Breaking News

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి. గీతాబాయి జిల్లా కార్యాలయం నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సందర్భంగా నాయుడు బడ్డీ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 1990 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం పాటించుట జరుగుతుందనియు జనాభా పెరుగుదల, పర్యావరణం మరియు అభివృద్ధికి వాటి సంబంధాలు మరియు సంబంధిత సమస్యలపై ప్రపంచ స్టేట్ హోల్డర్ల యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమే. ఆరోగ్య సంరక్షణను అందించటానికి జనాభా సమాచారాన్ని సేకరించుట, విశ్లేషించుట మరియు దానిని ఉపయోగించుటలో ప్రాముఖ్యతను వివరించినారు. జనాభాకు సంబంధించిన లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యమును మెరుగుపరుచుట జరుగుతుందని, తల్లి మరియు బిడ్డ శ్రేయస్సుకోసం సరైన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు బిడ్డకు మధ్య అంతరము అనే నినాదం ను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించవలసినదిగా వైద్య ఆరోగ్య సిబ్బందిని కోరడమైనది. పెరుగుతున్న జనాభా వలన గర్భధారణ మరియు ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన, కుటుంబ నియంత్రణ ,లింగ సమానత్వం మరియు తల్లుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా తెలియజేసినారు. పరిమిత కుటుంబం కొరకు బిడ్డకు బిడ్డకు మధ్య వ్యవధి ఉండటానికి కావలసిన కుటుంబ నియంత్రణ పద్ధతులు పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందనిరి .ముఖ్యంగా పురుషులు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అయిన వసెక్టమీ పాటించేటట్లు, తాత్కాలిక పద్ధతులు పిపి అయుసిడి ,అంతర ఇంజక్షన్లు, మాలా డి ,ఛాయా వంటి గర్భనిరోధక మాత్రలు గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఆచరించుడినట్లు చేయుట జరుగుతుందని తెలియజేసినారు .ఈ ర్యాలీ జిల్లా కార్యాలయం నుండి ప్రభుత్వ సాధారణ వైద్యశాల మచిలీపట్నం వరకు నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో బి .శివ సాంబి రెడ్డి హెచ్ .ఈ .ఈ .ఓ .,బి .రాజేంద్ర కుమార్ హెచ్. ఈ., జిల్లా మలేరియా విభాగం సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బోధనా సిబ్బంది, నర్సింగ్ విద్యార్థునులు ప్లే కార్డులు ధరించి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *