Breaking News

పేద ప్రజలకు రైతుబజారుల ద్వారా అందుబాటులోనికి నిత్యవసర సరుకులు

-కేజీ 160/- రూపాయలకే కందిపప్పు, 48/- రూపాయలకే సన్న బియ్యం
-రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులలో ముఖ్యమైన కందిపప్పు, బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు నందు కందిపప్పు, బియ్యాన్ని బజార్ల ద్వారా విక్రయించే స్టాల్స్ ను మంత్రి కందుల దుర్గేష్.. పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేస్జ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ధరలను నియంత్రించేందుకు గాను కందిపప్పు, బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. నిత్యవసర సరుకులలో అతి ముఖ్యమైన కందిపప్పు, బియ్యం బయట మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్నారు. పేదవాళ్లు వాటిని కొనుగోలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు ఇది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు నియంత్రణలోకి వచ్చేంతవరకు ఈ సరుకులను రైతుబజార్ల ద్వారా విక్రయించాలని సంకల్పించామన్నారు.

పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్.డి.ఏ కూటమి సభ్యులందరూ సమిష్టిగా కలిసి పేదలకు మంచి చేయాలని మంచి సంకల్పంతో వారి జీవన సరళి ఆనందంగా, సవ్యంగా సాగేందుకు కాను కనీస నిత్య అవసరాలు అయిన సరుకులను అందుబాటులోనికి తీసుకువచ్చామని ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. పేదప్రజలపై ధరలకు సంబంధించిన ఆర్థిక భారం పడకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ నిత్యవసర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు నియంత్రించి సాధారణ స్థితికి వచ్చేంతవరకు రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయాన్ని కొనసాగిస్తామన్నారు. ఒక్కో వినియోగ దారునికి తమ ఆధార్ కార్డు పై ఒక కేజీ కందిపప్పు రు. 160/-లకు, ఒక కేజీ బియ్యం రు.48 రూపాయలకు విక్రయించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. కందిపప్పు, బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని రావాల్సి ఉంటుందని ఆమె అన్నారు. రైతు బజార్ నందు విక్రయాలపై నిరంతరం అధికారులు పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రైతు బజార్లలో కందిపప్పు, బియ్యాన్ని పేద ప్రజలకు తక్కువ ధరలకు అందించాలని ఉద్దేశంతో ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎక్కడ అవకతవకలు జరగకుండా నాణ్యమైన సరుకులను అందించే విధంగా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ తగు బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువులైన కందిపప్పు, బియ్యం రేట్లు అధికంగా ఉన్నాయని, అట్టి ధరలను నియంత్రించేందుకుగాను హోల్సేల్ దగ్గర కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.

సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని, వారి సంక్షేమమే తమ ధ్యేయమని అందుకు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ ఏకతాటిపై కలిసికట్టుగా పని చేస్తామని ఆయన అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా నిత్యవసర సరుకులైన కందిపప్పు, బియ్యాన్ని విక్రయించేందుకు గాను స్టాల్స్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ స్టాల్స్ లో విక్రయాలను అధికారులతో పాటు తాము కూడా నిరంతరం పర్యవేక్షించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుతామన్నారు. రాజమహేంద్రవరం నగరవాసులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా మంత్రి తో కలిసి నిర్వహించుకున్నందుకు తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్, అర్బన్ తహసిల్దార్ ఆంజనేయులు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కే శ్రీనివాస్, ఏ ఎస్ ఓ నాగాంజనేయులు, ఎంఎస్ఓ అర్బన్ ఎం నాగలక్ష్మి, డియం సునీల్ వినయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *