తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అధికారుల పరిచయ కార్యక్రమం

-ఒకే కుటుంబంలా అభివృద్ది , సంక్షేమం కోసం కలిసి పని చేద్దాం
-మనందరి ముందు ఉన్న లక్ష్యం ప్రజా శ్రేయస్సు
-తూర్పు గోదావరి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదాం
-కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ది రెండింటిని సమ ప్రాధాన్యత
-నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి
-రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ను, రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అగ్రగామిగా నిలబడంలో పరస్పర సహకారంతో పని చేద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి లు పేర్కొన్నారు.

గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రజాపెద్దతులు ఆయా ప్రాంతాల సమస్యలు పెండింగ్ పనులు త్రాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలువల నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమావేశంలో వివరించడం జరిగింది. వాటికి సంబంధిత అధికారులు పనుల పురోగతిపై సమాధానాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు లు నియోజక వర్గ స్థాయిలో సమస్యలను ప్రస్తావించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు వెల్లడించిన సమస్యలపై వివిధ అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన అంశాలతో కూడి నివేదిక సిద్ధం చేసుకుని జిల్లాను అభివృద్ధి పథంలో ముందు ఉండేలాగా కలిసి పని చేద్దాం అన్నారు. రాష్ట్ర ప్రాధాన్యతా కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన భూమికను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజలకు అందజేయడంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో  ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి, ఆదిశగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు  తెలియజేసిన రహదారులు , ఆరోగ్యం,  జల వనరులు, త్రాగునీటి , సీజనల్ వ్యాధులు,  రోడ్డు రవాణా , అభివృద్ధి అంశాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. నూతన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. పరిచయ కార్యక్రమం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, అన్న ప్రసన రోజే ఆవకాయ పచ్చడి అనే విధానం కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఇచ్చిన హామీలను అమలు చేసే విధానంలో అడుగులు వేయనున్నట్లు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, సమర్ధ పాలకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం లో, అభివృద్ధి లక్ష్యంను ఆకాంక్షించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం సర్వతో అభివృద్ధికి కృషి చేస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా, అధికారుల, ఉద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. ఒకే మాట ఒకే తాటిపై రావడం కోసం ఖచ్చితమైన ఆలోచన ధోరణితో కలిసి పని చేద్దాం  అంతకు ముందుకు అధికారులకి మంత్రి పిలుపు నిచ్చారు. ఇప్పటికే పెన్షన్లను పంపిణీ చేశామని మరో అడుగు ముందుకేసి నిత్యవసర సరుకులను మార్కెట్ రేటు కంటే తగ్గించి అందించే కార్యక్రమము శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం అభివృద్ధి , నగర ట్రాఫిక్ సమస్య అధిగమించడం , 2027 పుష్కరాలు ఒక చక్కటి అవకాశం అన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని, ఇటు రాష్ట్రం అటు కేంద్రం తో సమన్వయం చేసుకుంటూ తనవంతుగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చొరవ తీసుకోవడం జరుగు తుందన్నారు. గోదావరి పరిరక్షణ , రాజమహేంద్రవరం నగరం అభివృద్ధి పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, తదనుగుణంగా నిధుల విడుదలకు తన వంతు కృషి చేస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు సుమారు రూ.5 కోట్ల మంది పుష్కర నది స్నానాలు ఆచరించేందుకు వస్తారన్న అంచనాలు ఉన్నాయనీ, వాటికి అనుగుణంగా క్రౌడ్ నిర్వహణా చేపట్టాల్సి ఉందన్నారు.

ఈ పరిచయ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్ ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, డిఆర్వో జి. నరసింహులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *