Breaking News

జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం

-జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు అంశాలు
-తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరిచయ కార్యక్రమంలో మంత్రి వర్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యల ను, నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల మరమ్మతులు,  సాగునీటి కాలువల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం, ఇండ్ల నిర్మాణాలు, రక్షిత తాగునీటి వ్యవస్థ, టిడ్కో గృహాల కేటాయింపులు తదితర అంశాలను ప్రస్తావించడం జరిగింది.

నిడదవోలు నియోజక వర్గం..
స్ధానిక శాసన సభ్యులు, పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ త్రాగునీటి సమస్య,  రహదారులు మరమ్మతులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత , శానిటేషన్, సాగునీరు, ఇరిగేషన్ కాలువల్లో తూడుల తొలగింపు తదితర సమస్యలు పై దృష్టి పెట్టాలి. సమస్య మూలం తెలుసుకుని అధికారుల స్థాయిలో సమన్వయంతో వాటి పరిష్కారం కోసం కృషి చెయ్యాలి. జిల్లాలో ఇకో, టెంపుల్, మెడికల్ పర్యటక దిశగా అభివృద్ది చెందాలి.  అందుకు అనువైన పరిస్థితులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కిట్స్ పూర్తి స్థాయిలో పంపిణీ చెయ్యాలి. ఇంకా కొందరు పుస్తకాలు, డ్రెస్ అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.  బాలిక విద్యపై ప్రత్యేక దృష్టి దారించాలి. మాతృ మరణాలు శిశు మరణాలు లేకుండా చూడాలి. గత భావజాలం విడనాడి నూతన ప్రభుత్వ మార్గదర్శకాలు , అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణలో జిల్లాను ముందు వరుసలో నిలపాలి.

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కార దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో స్వచ్ఛమైన  త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణ పై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు ఇందుకోసం క్షేత్రస్థాయిలో పంచాయతీ రాజ్ , ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవోలు వైద్య ఆరోగ్యశాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాలలో సమస్యల వాస్తవ రూపాన్ని వివరించడం, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలను కోరడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య ఇస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో “టీం తూర్పుగోదావరి జిల్లాగా”  జిల్లాను ప్రజాప్రతినిధులు అధికారులు మధ్య సమన్యుని సాధిస్తూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళదామని కలెక్టర్ సూచించారు.

కొవ్వూరు నియోజకవర్గ  శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కొరకు ఏ నిర్ణయం తీసుకున్న కార్యక్రమాన్ని ఆచరణ లో పెట్టడం లో అధికారులు,  ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అమలు చేస్తేనే విజయవంతం అవుతుందని  అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై  ఎంతో బాధ్యతనుంచారని  ఆ దిశగా  ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.  అధికారులు  తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి  ప్రజా ప్రతినిధులకు సహకరించాలన్నారు. గతంలో కూడా తాను ఒక పర్యాయం శాసన సభ్యులుగా ఉండడం జరిగిందని ప్రజా సమస్యలు  పరిష్కారం తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. కొవ్వూరు లోకి ఆర్టీసీ బస్సులు వచ్చేలా, గతంలో కొన్ని రోడ్లలో తిరుగుతున్న పల్లె వెలుగు బస్సులను అపివేశారని, వాటిని పునరుద్దించాలని కోరారు.

రాజానగరం  శాసనసభ్యులు బత్తుల బల రామకృష్ణ
జి ఎర్రంపాలెం  బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా  జరిగిన రు. 67 లక్షల స్కాంను త్వరతగతిన పరిష్కరించే విధంగా    చర్యలు తీసుకోవాలన్నారు. గత నాయకులు చేసిన తప్పిదాలు వలన  తమకు చెడ్డ పేరు వస్తోందని  వివరించారు. ఇండ్లపట్లాలు తొర్రిగడ్డ రిజర్వాయర్, తాగునీటి సమస్య జలజీవన్ మిషన్ పథకం అంశాలను ప్రస్తావించారు

అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
నియోజకవర్గం లో ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శుద్ధమైన త్రాగునీరు , విద్యుత్ సౌకర్యం అరకొరగా ఉన్నాయని  అధికారులు దీనిపై దృష్టి సారించి  ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం  పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్లో  రైతులకు యూరియా అవసరం ఎంతో ఉందని మా నియోజకవర్గంలో  రంగంపేట,  సింగనపల్లి సొసైటీలు ఉన్నాయని  డిడి చెల్లిస్తేనే గాని క్రెడిట్ కింద  యూరియా సప్లై చేయనంటు న్నారని  ఈ విషయమై  మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  గోదావరి ప్రధాన కాలువ కాలుష్యహితంగా ఉందని తెలిపారు.

శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్
శాసన మండలి  వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, సభ్యులు  మంత్రి జిల్లాస్థాయి అధికారుల తో పరిచయ కార్యక్రమం ఏర్పాటు  చేయడం అభినందనీయ మన్నారు. ఇటువంటి కార్యక్రమం ద్వారా  జిల్లాలో ఆయా శాఖ లు వారి చేపట్టిన కార్యక్రమాల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. అధికారులు పారదర్శకంగా నిబద్ధంతో  ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వారు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తే  సత్వర ఫలితాలు  ఉంటాయన్నారు.
జిల్లా , నియోజక వర్గాల సమస్య లపై నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఒక్క నెలలోనే పూర్తి స్థాయిలో  అవగాహన కలిగి ఉండడం వారీ నిబద్ధత చాటుతున్నట్లు తెలిపారు. ప్రజా శ్రేయస్సు నేపథ్యం లో ఎమ్ ఎల్ సి గా తనవంతు మద్దతు అభివృద్ధికి సహకరం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం అభివృద్ది కై నియోజక వర్గ శాసనసభ్యులు,  మంత్రి దుర్గేష్  చర్యలకు మద్దతు నిలుస్తామని తెలియ  పరిచారు.

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
ఇండ్ల పట్టాల పంపిణీ ఆవ భూముల స్థలాలు కేటాయింపు పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. టీడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని, వారు అద్దెలు చెల్లించుకుంటూ,  బ్యాంకులకు ఇంటి నిర్మాణ వాయిదాలను చెల్లిస్తున్నట్లు తెలిపారు.. ఇండ్ల పత్రాలను అందజేసేందుకు కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వెలుగు బంధ హౌసింగ్ కాలనీలో బాలిక వసతులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ సేవలు అందుబాటులో తీసుకురావాలని కోరారు.

గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు 
నియోజకవర్గంలో నల్లజర్ల ప్రాంతంలో ఆర్ అండ్ బి అధికారులు  పాత బ్రిడ్జి స్థానంలో సమాంతరంగా నూతన బ్రిడ్జిని  నియమించడం ప్రారంభించడం కూడా జరిగిందన్నారు..అయితే మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్  తొలగించుకుపోవడం ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారుల  సమన్వయ లోపం ఇక్కడ కనిపిస్తోందన్నారు..ఇందు వలన  ఈ బ్రిడ్జి  మీదుగా వెళ్లాలంటే  వాహన చోధకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  వివరించారు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తెచ్చారు.  ప్రజా ప్రతినిధులు అధికారులతో ప్రతి నెల ఇటువంటి సమావేశం నిర్వహించడం ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం సాధించే అవకాశం ఉందన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *