Breaking News

అధికారులు బాధ్యతతో పనిచేయాలి, ప్రజలకు జవాబు దారీగా ఉండాలి

-సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష సమావేశం
-ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సాధ్య సాధ్యానాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతతో పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేలా వారికి సమాచారం అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *